Diabetes Risk: ఆధునిక జీవన విధానంలో ప్రదాన సమస్యగా మారిన వ్యాధి డయాబెటిస్. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనవిధానమే దీనికి కారణం. డయాబెటిస్ వ్యాధి ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరం. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్ సమస్య ఉండదంటున్నారు. అదెలాగో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం వ్యాధికి ఇప్పటి వరకూ సరైన పూర్తి చికిత్స లేదు. వివిధ రకాల మందులతో కేవలం నియంత్రణ ఒక్కటే సాధ్యం. అందుకే డయాబెటిస్ వ్యాధి విషయంలో అప్రమత్తత చాలా అవసరం. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యంగా తినే ఆహరం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు ఆహారపు అలవాట్లు, జీవనవిధానం డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణాలు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటుంటే డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.


గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా ఉపయోగకరం కూడా. ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ డైట్‌లో గుడ్లు చేరిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


తృణ ధాన్యాలు ఆరోగ్యానికి ఓ ఔషధంలా పనిచేస్తాయి. ఇందులో ఉండే లిక్విఫైడ్ ఫైబర్ కారణంగా మధుమేహం ముప్పు ఉండదు. ఎందుకంటే ఫైబర్ అనేది డయాబెటిస్‌కు విరుగుడు. ఓట్స్, గోధుమలు, జొన్నలు వంటివి తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.


ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా కన్పించే దాల్చినచెక్కతో డయాబెటిస్ వ్యాధికి మంచి పరిష్కారముంటుంది. ఇందులో వివిధ రకాల పోషకాలుంటాయి. దాల్చిన చెక్క శరీరంలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులు బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించేందుకు దాల్చిన చెక్కను వినియోగించవచ్చు. రోజువారీ ఆహార పదార్ధాల్లో దాల్చిన చెక్కను జోడిస్తే మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు.ః


Also read: Plums For Weight Loss: రేగు పండ్లతో శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా? శరీర బరువు కూడా తాగొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook