Strong Bones: ఎవరికైనా సరే జీవితంలో 30 ఏళ్లు దాటుతున్నాయంటే ఇక యౌవనం పోయి మధ్య వయస్సు వచ్చేస్తోందని అర్ధం. అందుకు తగ్గట్టే 30 ఏళ్లు దాటితే శరీరంలో ఎముకలు బలహీనమౌతుంటాయి. కేవలం వయస్సు ఒక్కటే దీనికి కారణం కాదు. వివిధ రకాల ఆహారపు అలవాట్లు జీవనశైలి ప్రధాన కారణమౌతుంటాయి. తెలిసో తెలియకో చేసే కొన్ని అలవాట్ల వల్ల ఎముకలు బలహీన పడటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ రకాల అనారోగ్యపు ఆహార పదార్ధాలు, చెడు అలవాట్ల కారణంగా 30 ఏళ్లు దాటాక ఎముకల డెన్సిటీ క్రమంగా తగ్గిపోతుంటుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల వల్ల ఎముకలు త్వరగా విరిగే అవకాశం ఉంది. అయితే ఎముకల్ని పటిష్టం చేయడం అంత కష్టమేం కాదు. కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా మార్చవచ్చు. ఆ సూచనలేంటో తెలుసుకుందాం..


హెల్తీ లైఫ్‌స్టైల్


దీనికోసం రోజూ తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. ఒత్తిడి తగ్గించేందుకు యోగా లేదా మెడికేషన్ అలవర్చుకోవాలి. ఎముకలు పటిష్టంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డితో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎముకలు బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. జీవితంలో యాక్టివ్‌గా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. 


కాల్షియం, విటమిన్ డి


ఎముకల తయారీలో కాల్షియం, విటమిన్ డి కీలక భూమిక పోషిస్తాయి. రోజూ కనీసం 1000 మిల్లీగ్రాముల కాల్షియం, 600-800 యూనిట్ల విటమిన్ డి తప్పకుండా ఉండాలి. పాలు, పెరుగు, పన్నీర్, ఆకు కూరలు, సోయాబీన్, బాదం వంటి ఆహార పదార్ధాల్లో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇక విటమిన్ డి కోసం బెస్ట్ సోర్స్ సూర్య రశ్మి. లేదా గుడ్లు, మష్రూం, చేపల్లో కూడా విటమన్ డి ఎక్కువగా ఉంటుంది. 


బరువు నియంత్రణ


శరీరం బరువు పెరగడం కూడా ఎముకలపై ఒత్తిడి పెంచుతుంది. క్రమంగా మనకు తెలియకుండానే ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకే హెల్తీ వెయిట్ ఉండేట్టు చూసుకోవాలి. బ్యాలెన్సింగ్ డైట్, రోజూ తగిన వ్యాయామం లేదా వాకింగ్, తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. అప్పుడే బరువు నియంత్రణలో ఉంటుంది. ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. 


ఎముకలు, కండరాలు ఎంత పనిచేస్తే అంతగా పటిష్టమౌతుంటాయి. అందుకే రోజూ తగినంత వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా సైక్లింగ్ చాలా మంచిది. దీనివల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి.


Also read: Budget 2024: బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను మినహాయింపు 8 లక్షలకు పెరిగేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook