Belly Fat tips: ఈ రెండు ఫ్రూట్స్ డైట్‌కు దూరం చేస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య మాయం
Belly Fat tips: ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Belly Fat tips: లైఫ్‌స్టైల్ మారేకొద్దీ శరీర బరువు కూడా పెరిగిపోతుంటుంది. ముఖ్యంగా వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి ఇందుకు కారణాలు. నడుము,పొట్ట చుట్టూ బెల్లీ ఫ్యాట్ పెరిగి అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో పరిశీలిద్దాం.
దేశంలో అన్‌హెల్తీ ఫుడ్స్ , ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అందుకే ఇక్కడి ప్రజల్లో అధిక బరువు పెను సమస్యగా ఉంటుంది. అటు బెల్లీ ఫ్యాట్ కూడా ఎక్కువై చాలా అసౌకర్యంగా ఉంటుది. నలుగురిలో వెళ్లేందుకు సంకోచించే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి విముక్తి పొందాలంటే హెల్తీ డైట్ చాలా అవసరం. హెల్టీ డైట్ అంటే పండ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి కావు. కొన్ని రకాల ఫ్రూట్స్ వల్ల సమస్య మరింత జటిలమౌతుంది. అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముఖ్యంగా రెండు రకాల ఫ్రూట్స్‌ని డైట్ నుంచి దూరం చేయాలి.
మార్కెట్‌లో లభించే కొన్ని పండ్లు తినడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ముఖ్యంగా స్థూలకాయం, డయాబెటిస్ రోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. బరువు అధికంగా లేకపోయినా సరే హై షుగర్ ఫ్రూట్స్ తినకూడదు. ఒకవేళ తిన్నా మితంగా ఉండాలి.
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, షుగర్ లేకుండా చూసుకోవాలి. లో ఫ్యాట్ ఫుడ్స్ కూడా బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. బరువు పెరగడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుంది. ఫలితంగా గుండెపోటు వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లో మామిడి పండ్లు పుష్కలంగా ఉంటాయి. మామిడిని పండ్ల రారాజుగా పిలుస్తారు. దేశ ప్రజలు చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ ఇది. మామిడిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమౌతుంది. అటు పైనాపిల్ కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇది తినడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రత్యేకించి డయబెటిస్, స్థూలకాయం సమస్య ఉన్నవాళ్లు పైనాపిల్ తినడం మంచిది కాదు.
Also read: Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook