Iron Deficiency: ఇటీవలి కాలంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లేదా చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎనీమియా కేసులు పెరుగుతున్నాయి. అంటే రక్తంలో ఐరన్ లోపించడం లేదా హిమోగ్లోబిన్ కొరత. ఇది పైకి కన్పించేంత తేలికైన అంశం కాదు. కొన్ని సందర్భాల్లో ఇది సీరియస్‌గా మారుతుంది. ఎందుకంటే ఐరన్ లోపం అనేది శరీరాన్ని బలహీనపరుస్తుంది. కేవలం డైట్ మార్చుకోవడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో ఐరన్ లోపం అంటే అర్ధం బ్లడ్ సెల్స్ తగ్గిపోవడమే. సాధారణంగా మగవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 13-14 వరకూ ఉండాలి. అదే మహిళల్లో 12-13 వరకూ ఉండాలి. హిమోగ్లోబిన్ శాతం 8 కంటే తగ్గితే ప్రమాదకర పరిస్థితిగా భావిస్తారు. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేసేది రక్త కణాలే. ఐరన్ లోపిస్తే రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఐరన్ లోపం సహజంగా నెలసరి మహిళలు, గర్భిణీల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, మహిళల్లో ఈ సమస్య అధికంగా కన్పిస్తోంది. ఐరన్ లోపాన్ని సరిచేసేందుకు సాధారణంగా సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే ఆహార పదార్ధాల ద్వారా ఐరన్ లోపం సరిచేయడం అత్యుత్తమ మార్గం. అందుకే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.


బ్రోకలీ ఐరన్ లోపాన్ని సరిచేసేందుకు అద్భుతంగా దోహదపడుతుంది. ఒక కప్పు వండిన బ్రోకలీలో 1 మిల్లీగ్రాము ఐరన్ ఉంటుంది. దాంతోపాటు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఐరన్ సంగ్రహణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు..కేన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. 


డార్క్ చాకొలేట్ కూడా ఐరన్‌కు మంచి ప్రత్యామ్నాయం,. 28 గ్రాముల చాకోలేట్‌లో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దాంతోపాటు మెగ్నీషియం, కాపర్ కూడా ఉంటాయి. రక్త హీనత సమస్య నుంచి బయటపడాలంటే డార్క్ చాకోలేట్ తినడం మంచి ఆప్షన్ కాగలదు. 


పాలకూర మరో ముఖ్యమైన ఆహార పదార్ధం. 100 గ్రాముల పచ్చి పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల పాలకూర ఉంటుంది. ఇక విటమిన్ సి పుష్కలంగా లభించే ఆకు కూర ఇదే. ఫలితంగా శరీరంలో ఐరన్ సంగ్రహణ బాగుంటుంది. హిమోగ్లోబిన్ కొరత ఉండేవారికి పాలకూర చాలా బాగా పనిచేస్తుంది. 


ఆనపకాయ గింజలు కూడా ఐరన్ లోపానికి మంచి పరిష్కారం. 28 గ్రాముల ఆనపకాయ గింజల్లో 2.5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటటుంది. దాంతోపాటు ఇందులో విటమిన్ కే, జింక్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని సరిచేయడమే కాకుండా మధుమేహం వ్యాధిగ్రస్థులకు కూడా అద్భుతంగా దోహదం చేస్తుంది. 


కాబూలీ శెనగల్లో కూడా  ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు వండిన కాబూలీ శెనగల్లో 6.6 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. శాకాహార భోజన ప్రియులకు ఇది మంచి ఆప్షన్. 


Also read: Ramadan Diet: ఉపవాసాల్లో ఎలాంటి డైట్ ఉండాలి, మధుమేహంం వ్యాధిగ్రస్థులు ఏం చేయాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook