Healthy Bones: నలభై ఏళ్లు దాటాక కూడా ఎముకలు బలంగా ఉండాలంటే డైట్‌లో ఏం తినాలి
Healthy Bones: మనిషి శరీర నిర్మాణంలో ఎముకలు అత్యంత కీలకం. బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చేవరకే ఎముకల ఎదుగుదల, పటిష్టత ఉంటుంది. ఆ తరువాత ఆ ఎముకల సంరక్షణ మన చేతుల్లో ఉంటుంది. దీనికోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Healthy Bones: నిర్ణీత వయస్సు వచ్చిన తరువాత ఎముకల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఇక అక్కడ్నించి ఎముకల సంరక్షణ పూర్తిగా మనచేతుల్లోనే ఉంటుంది. 40 వయస్సు దాటిన తరువాత ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. ఈ సమయంలో బలమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం అందించవచ్చు.
మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి ఎముకలే. ఇవి బలంగా ఉన్నంతవరకే మనిషి యాక్టివ్‌గా ఉంటాడు. ఏ పనైనా సక్రమంగా చేయగలడు. ఎముకలు బలహీనంగా ఉంటే పూర్తిగా నిస్సత్తువ ఆవహిస్తుంది. ఏ పనీ చేయలేరు. రోజూ వారీ పనులు కూడా చేయలని పరిస్థితి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎముకల సమస్య తలెత్తకుండా ఉండేందుకు హెల్తీ ఫుడ్స్ తింటుండాలి. సాధారణంగా వయస్సు 40 దాటిన తరువాత ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి న్యూట్రియంట్లు తప్పకుండా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకూ కాల్షియం, విటమిన్ డి ఆహార పదార్ధాల్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ తరహా పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకోవాలి.
పాలు, పాల ఉత్పత్తులు, ఆకుపచ్చని కూరగాయలు, ఓట్స్, కిచిడీ, హోల్ గ్రెయిన్, పండ్లు, క్యారట్, మటర్, మకనా, అంజీర్, నట్స్, గుడ్లు, బీట్‌రూట్, మష్రూం, ముల్లంగి, పాలకూర వంటివి డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఈ పదార్ధాలు డైట్‌లో ఉంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి.
పచ్చి కూరగాయల సలాడ్‌ను భోజనంలో చేర్చితే చాలా ప్రయోజనాలుంటాయి. రోజుకు 2 సార్లు పాలు తప్పకుండా తాగితే శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. దీంతోపాటు తక్కువ కొవ్వున్న పాల ఉత్పత్తులు తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. అదే విధంగా రోజూ పప్పు దినుసులు తినడం వల్ల శరీరానికి కావల్సినన్ని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి అందుతుంది. గుడ్లు, ఇతర నాన్ వెజ్ పదార్ధాలు తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాల్సి వస్తుంది. రోజూ కనీసం ఓ అరగంట తేలికపాటి వ్యాయామం చేయాలి.
Also read; Stress Relief Foods: ఈ ఐదు పదార్ధాలు తీసుకుంటే చాలు ఒత్తిడి, డిప్రెషన్ అన్నీ మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook