Curd Food Combination: పెరుగుతో ఈ పదార్ధాలు తింటే మూల్యం చెల్లించుకోవల్సిందే..తస్మాత్ జాగ్రత్త
Curd Food Combination: వేసవి కాలం నడుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. బయట లోపలా వేడి కారణంగా అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అందుకే వేసవిలో పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కల్గిస్తుంది. అదే సమయంలో పెరుగుతో కొన్ని రకాల పదార్ధాలు తినకూడదని అంటారు. ఆ వివరాలు మీ కోసం..
Curd Food Combination: ఎండాకాలంలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కడుపుకు శరీరానికి చలవ చేస్తుంది. కానీ పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. పెరుగుతో ఎలాంటి కాంబినేషన్ మంచిది కాదో తెలుసుకుందాం..
మనిషి శరీర నిర్మాణంలో ఎముకలు అత్యంత కీలకం. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. పాలు, పెరుగులో కాల్షియం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. పెరుగులో అయితే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉంటే చాలా రకాల వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. కానీ కొన్ని పదార్ధాల కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. పెరుగుతో కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల జీర్ణక్రియ, చర్మ సంబంధిత సమస్యు ఎదుర్కోవల్సి వస్తుంది.
పెరుగుతో చేపలు కలిపి తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ రెండింట్లోనూ ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అందుకే చేపలు, పెరుగు కలిపి తినకూడదంటారు.
ఆయిలీ పదార్ధాలైనా పూరీ, ఛోలే భటూరేలతో చాలామంది పెరుగు తీసుకోవడం చూస్తుంటాం. కానీ పెరుగుతో ఈ కాంబినేషన్ మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఆయిలీ ఫుడ్స్‌తో పొరపాటున కూడా పెరుగు తినడం మంచి అలవాటు కాదు.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది పాలు పెరుగు కాంబినేషన్. ఇది ఏ మాత్రం మంచిది కాదని చాలాకాలంగా తెలుసు. పాలు పెరుగు కలిపి తీసుకుంటే గ్యాస్, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం వంచి సమస్యలు తలెత్తవచ్చు. పాలు, పెరుగు రెండింట్లోనూ ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
పెరుగు తినేటప్పుడు పుల్లటి పండ్లను పొరపాటున కూడా తినకూడదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పెరుగన్నంతో పాటు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, నిమ్మ వంటివి తింటే కచ్చితంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు.
చాలామంది పెరుగన్నంలో మామిడి పండ్లు తింటుంటారు. సాధారణంగా ఎక్కువగా కన్పించే కాంబినేషన్ ఇది. మామిడి స్వభావం వేడి, పెరుగు చలవ చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు చర్మ సంబందిత సమస్యలు తలెత్తుతాయి.
Also read: Papaya Seeds: బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ డస్ట్ బిన్‌లో వేయరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook