Sugar vs Honey: మధుమేహం వ్యాధిగ్రస్థులకు తేనె మంచిదా కాదా, తేనెతో బరువు తగ్గుతుందా
Sugar vs Honey: ఆధునిక జీవన విధానంలో మధుమేహం అత్యంత ప్రమాదకరంగా మారింది. రోజూవారీ జీవితంలో అలవాట్లు, తీసుకునే ఆహారం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంటుంది. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే ఇక పూర్తిగా నిర్మూలన అసాధ్యమే.
Sugar vs Honey: ఇటీవలి కాలంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉందన్నా అతిశయోక్తి అవసరముండదు. లైఫ్‌స్టైల్ మార్చుకోవడం, డైట్‌పై తగిన శ్రద్ధ పెట్టడం ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనె డయాబెటిస్ రోగులకు ఎలాంటి పరిష్కారాన్నిస్తుందో తెలుసుకుందాం..
నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధుల్లో సగానికి పైగా లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తున్నాయి. పని ఒత్తిడి, టెన్షన్, ఆందోళన, సమయానికి తినకపోవడం, స్థూలకాయం కారణంగా మధుమేహం వేగంగా సంక్రమిస్తోంది. ఒకసారి వచ్చిందంటే పూర్తి స్థాయిలో నిర్మూలన లేనందున మందులు వాడుతూ డైట్ మార్చుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అదే సమయంలో బరువు తగ్గించుకోవల్సి ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులు బరువు తగ్గించుకోవాలంటే తేనె వినియోగిస్తే మంచిదా కాదా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
తేనెను నేచురల్ స్వీట్నర్‌గా పిలుస్తారు. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇవి పంచదార కంటే తియ్యగా ఉంటాయి. అదే సమయంలో ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అదే పంచదారలో అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు.సుక్రోజ్ ఉంటుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్తులకు షుగర్ కంటే తేనె మంచి ఆప్షన్. ఇందులో ఉండే పోషకాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బరువు తగ్గించుకునే ప్రక్రియలో తేనె అంతగా పనిచేయదంటున్నారు. ఎందుకంటే చక్కెరతో పోలిస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. ఒక స్పూన్ తేనెలో 64 కిలో కేలరీలు ఉంటే, అదే చక్కెరలో 48 కిలో కేలరీలుంటాయి. అందుకే బరువు తగ్గించుకునేందుకు తేనె అంత మంచి ఆప్షన్ కాదు.
బరువు తగ్గాలనుకున్నప్పుడు కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి. డైట్‌లో తేనెను భాగంగా చేసుకుంటే మీరు అనుకున్న ఫలితం బరువు తగ్గడం నెరవేరదు. ఎందుకంటే తేనె, చక్కెర రెండింటి గ్లైసెమిక్ ఇండెక్స్‌లో పెద్ద తేడా లేదు. అయితే తేనెలో ఐరన్, కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చక్కెర కంటే తేనే ఆరోగ్యానికి మంచిది. కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులకు మాత్రం తేనె కూడా అంత మంచిది కాదంటున్నారు.
Also read: Lungs Health: ఆ విటమిన్ లోపిస్తే ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయి తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook