Health Tips and Remedies: రోజూ పరగడుపున ఆ ఒక్కటి తింటే చాలు...అన్ని సమస్యలకు చెక్
Health Tips and Remedies: నిత్య జీవితంలో తలెత్తే వివిధ రకాల వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలకు చాలా కారణాలుంటాయి. అదే సమయంలో అన్నింటికీ ప్రకృతిలో లబించే పదార్దాల్లోనే పరిష్కారం కూడా దాగుంటుంది. ఇందులో ఒకటి లవంగం. లవంగంతో కలిగే ప్రయోజనాలు వింటే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు.
Health Tips and Remedies: ప్రతి భారతీయుడి కిచెన్‌లో తప్పకుండా లభించే మసాలా దినుసు లవంగం. లవంగాన్ని వివిధ రకాల వంటల్లో రుచి, వాసన కోసం వినియోగిస్తుంటారు. కానీ దీంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. ఇదొక సూపర్ పుడ్ లాంటిది. నిత్యం ఎదుర్కొనే చాలా సమస్యలకు దీంతో పరిష్కారం లభిస్తుందంటారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్దాల్లోనే ఉంది. సాధారణంగా భారతీయులు ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యపరంగా చాలా మేలుచేకూరుస్తాయి. ఇందులో లవంగం కీలకమైందిగా చెప్పాలి. మన చుట్టూ లభించే వస్తువులు లేదా పదార్ధాలతో ఆరోగ్యాన్ని చాలా వరకు సంరక్షించుకోవడమే కాకుండా ఫిట్‌గా ఉండవచ్చు. లవంగంతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున లవంగం తినడం వల్ల చాలా లాభాలున్నాయి. పరగడుపున లవంగం తీసుకుంటే.ఆరోగ్యపరంగా కలిగే లాభాలేంటో చూద్దాం..
అన్నింటికంటే ముఖ్యమైనది బరువు తగ్గించుకోవడం. మీ బరువు తగ్గించాలంటే..లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం వేళ సాధారణంగా శరీరం మెటబోలిజం తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో లవంగం తినడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. ఎప్పుడైతే మెటబోలిజం వేగవంతమౌతుందో జీర్ణక్రియ మెరుగుపడి..క్రమంగా బరువు తగ్గుతారు. లవంగం తిన్న తరువాత గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితాలుంటాయి.
ప్రస్తుతం ఇమ్యూనిటీ అనేది చాలా అవసరంగా మారింది. లేకపోతే వివిధ రకాల సీజనల్ వ్యాదులు ఇట్టే చుట్టుముడుతున్నాయి. ఇమ్యూనిటీని పటిష్టం చేయడంలో
లవంగం అద్బుతంగా ఉపయోగపడుతుంది. లవంగం తినడం వల్ల శరీరంలోని విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి. దాంతో రక్తం శుద్ది చెంది శరీరంలో వైట్ బ్లడ్‌సెల్స్ నిర్మాణం సాధ్యమౌతుంది. అంతేకాకుండా..లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.
రోజూ పరగడుపున లవంగం తీసుకుంటే..జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా జీర్ణక్రియకు సంబంధిత చాలా సమస్యలు దూరమౌతాయి. ఒకవేళ మీకు గ్యాస్, అజీర్ణం సమస్యలుంటే..పరగడుపున లవంగం తినడంతో ఆ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. మరో ప్రధానమైన సమస్య పంటి నొప్పి.లవంగంతో ఈ సమస్య నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. ఈ విధానం అనాదిగా అమల్లో ఉన్నదే. పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 1-2 లవంగాలను పంటి కింద నొక్కిపెట్టి ఉంచుకోవాలి. లేదా లవంగం నూనె కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి నుంచి చాలా వేగంగా రిలీఫ్ లభిస్తుంది.
Also read: Weight Reduction: ఓవర్ డైటింగ్, వర్కవుట్లతో బరువు తగ్గించడం మంచిదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook