Foods to Avoid: ఆ ఆహార పదార్ధాల్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోకూడదు..ఎందుకంటే
Foods to Avoid: మనం తీసుకునే ఆహార పదార్ధాలు, ఆహారపు అలవాట్లే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం. లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
Foods to Avoid: మనం తీసుకునే ఆహార పదార్ధాలు, ఆహారపు అలవాట్లే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం. లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
మనం తినే ఆహార పదార్ధాలు లేదా తీసుకునే ద్రవ పదార్ధాలు ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని తీసుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.
ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. దీంతో కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది.ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి.
పరగడుపున టీ లేదా కాపీ అలవాటుందా..
కొంతమంది ఉదయం వేళ అంటే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.
ఉదయం వేళల్లో ఆల్కహాల్ సేవనం
పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. పైన సూచించినవన్నీ కేవలం సురక్షితంగా ఉండేందుకు మాత్రమే.
Also read: Saunf Tips: సోంపు తినడం మంచిదా కాదా..ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి