Disadvantages Of Arbi: చామదుంపను అందరు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈ దుంపలో ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ ఎ, సి, కాల్షియం మొదలైన ఉంటాయి. దీంతో ఇది గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు అధిక రక్తపోటు తగ్గించి..రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రతిదానికీ ప్రయోజనాలు ఉన్నట్లు, నష్టాలు కూడా ఉంటాయి. అదే విధంగా చామదుంపలో ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం. చామదుంప మన శరీరానికి ఎలా హాని చేస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చామదుంప వల్ల శరీరానికి ఈ నష్టం తప్పదు..?


చామదుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు మెరుగు పరచేందుకు సహాయపడుతుంది. అయితే దుంపలో కార్బోహైడ్రేట్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా జీర్ణం వ్యవస్థ దెబ్బతింటుంది. 



చామదుంప తినడం వల్ల ఈ నష్టాలు కలుగుతాయి:


మూత్రపిండాల్లో రాళ్లు :


చామదుంపలో ఆక్సాలిక్ యాసిడ్ స్థాయి అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ చెడిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఏదైనా కిడ్నీ సమస్య ఉంటే దుంపను తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  అంతే కాకుండా ఇందులో ఉండే క్యాల్షియం, ఆక్సాలిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతుంది.


చర్మంపై చికాకు:


చామదుంపను అధికంగా తీనడం వల్ల చర్మం మంట, దురద లేదా వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతే కాకుండా దీని ఆకులు మానవ శరీరానికి ఎంతో హానికరమని నిపుణులు అంటున్నారు.


చామదుంపను తింటే మంచిదేనా:


 ఆస్తమా, వాత రుగ్మత, మోకాళ్ల నొప్పులు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దుంపను తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచే అవకాశాలున్నాయి. దీనితో పాటు గర్భిణిలు ఈ దుంపను తినకూడదని ఒకవేళా తినాలనుకుంటే, ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Detox Water For Weight Loss: ఈ డిటాక్స్ వాటర్ శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..!!


Also Read: Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలిగా పూజాహెగ్డే.. హీరో ఎవ‌రంటే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook