Java plum benefits for mens: వేసవిలో నేరేడు పళ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇవీ తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. ఇది రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా మగవారు తప్పకుండా దీనిని తీసుకోవాలి. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ (Sperm Count) మెరుగుపడుతుంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా నేరేడు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదర సమస్యలకు చెక్
నేరేడులో విటమిన్‌ బి, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఉదర సమస్యలు మన దరిచేరవు. వీటిని వేసవిలో వీలైనంత ఎక్కువగా తీసుకోండి.


గుండెకు చాలా మంచిది
జామున్ గుండెకు కూడా చాలా మంచిది. దీన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది.


వీరు తప్పనిసరిగా తినాలి
డయాబెటిక్ పేషెంట్లు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వినియోగం రక్తంలో చక్కెరను పెంచదు. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుతుంది. మధుమేహ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవాలి.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే, మీరు ఖచ్చితంగా నేరేడు తినాలి. మీరు దీని నుండి చాలా ప్రయోజనం పొందుతారు.


Also Read: Face Care Tips: పాల మీగడతో మీ ముఖ సౌందర్యం..బంగారంలా మెరిసిపోతుంది..ఎలాగంటే 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.