Tulsi Water Benefits: హిందూమతం ప్రకారమే కాకుండా..ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం కూడా తులసి ఆకులకు, తులసి నీళ్లకు ప్రత్యేక స్థానముంది. మధుమేహం నియంత్రణలో తులసి నీళ్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహంతో బాధపడుతూ..వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమైతే మీ కోసం మరో అద్భుతమైన ఔషధముంది. హిందూవులు పవిత్రంగా భావించే తులసి మొక్క ఆకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయని ఆయుర్వేద వైద్యశాస్త్రం చెబుతోంది. 


బ్లడ్ షుగర్ అనేది చాలా ప్రమాదకరం. బ్లడ్ షుగర్ స్థాయి పెరిగేకొద్దీ మీరు డయాబెటిక్ పేషెంట్‌గా మారిపోతారు. అయితే మధుమేహానికి ఆయుర్వేదంలో మంచి ప్రత్యామ్నాయం ఉందంటున్నారు వైద్యులు. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలితో చాలావరకూ రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే..బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించవచ్చు. తులసి ఆకుల నీళ్లను మధుమేహం తగ్గించేందుకు ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.


బ్లడ్ షుగర్ నియంత్రణలో తులసి నీరు...


తులసి నీళ్ళతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఓ గ్లాసు నీళ్లలో తులసి ఆకులు కొన్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడపోసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


తులసి నీళ్లతో ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తులసి నీళ్లు జలుబు, దగ్గు తగ్గించేందుకు అద్భుతమైన ఔషధంగా ఉపయోపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు తులసి ఆకులు గానీ, తులసి నీళ్లు గానీ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 


Also read: Diabetes Control Tips: అవును నిజమే.. నిమ్మకాయ రసంతో కూడా సులభంగా కేవలం 10 రోజుల్లో మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook