మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఎముకల పటిష్టత చాలా అవసరం. వయస్సుతో సంబంధం లేకుండా ఎముకల్ని బలంగా ఉంచుకోవాలి. మీ డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చకపోతే..వెన్నుపూస బలహీనపడే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరం బలంగా ఉండాలంటే ఎముకల్లో పటిష్టత అవసరం. దీనికోసం కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. కాల్షియం లోపం కారణంగా ఎముకలు బలహీనమౌపోతాయి. ఆధునిక జీవితంలో చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా వయస్సు మూడు పదులు దాటగానే..వెన్నుపూస సమస్య అధికమౌతోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే..పోషక పదార్ధాలు సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే ఓ వయస్సు దాటాక ఎముకలు బలహీనమౌతాయి. ఇదంతా వెన్నుపూసపై ప్రభావం పడుతుంది. వెన్నుపూస బలహీనంగా ఉంటే..నడుము నొప్పి సహా చాలా సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా తక్కువ వయస్సులోనే శరీరం పనిచేసే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. అందుకే డైట్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 


పాల ఉత్పత్తులు


ఎముకలు బలహీనంగా ఉన్నాయంటే..కచ్చితంగా కాల్షియం లోపమే అందుకు కారణం. శరీరంలో కాల్షియం లోపం కారణంగా ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఫలితంగా నడుము నొప్పి సమస్య వెంటాడుతుంది. ఎముకల్ని బలంగా మార్చేందుకు మీ డైట్‌లో పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్ ఉండేట్టు చూసుకోవాలి.


పప్పు, బీన్స్


పప్పుధాన్యాల్లో పెద్దమొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. బీన్స్ కూడా పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పదార్ధాలు ఎముకల్ని పటిష్టంగా మార్చేందుకు దోహదపడతాయి. చియా సీడ్స్ ఇందుకు దోహదపడతాయి. ఎముకల్ని పటిష్టపర్చేందుకు చియా సీడ్స్ చాలా ఉపయోగకరం.


పండ్లతో ప్రయోజనాలు


పండ్లలో పుష్కలంగా పోషక పదార్ధాలు ఎముకల్ని నష్టపర్చవు. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, లేదా పండ్ల జ్యూస్ అవసరం. ఇలా చేయడం వల్ల బోన్ పెయిన్స్ ఉండవు. వయస్సు మూడు పదులు దాటాక కూడా వెన్నుపూస ఆరోగ్యంగా ఉంటుంది.


ఆకుపచ్చ కూరగాయలు


ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా రోగాల్ని దూరం చేస్తాయి. వెన్నుపూసను పటిష్టంగా చేసేందుకు ఆకుపచ్చ కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రియన్స్ వెన్నుపూసను బలోపేతం చేస్తాయి. రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే వెన్నుపూస ఎప్పటికీ బలహీనపడదు. పాలకూరతో పాటు, బ్రోకలీ, అరటికాయ కూడా చాలా ప్రయోజనకరం.


Also read: Skin Care Tips: చలికాలం చర్మ సమస్యల్నించి రక్షించే..నేచురల్ క్రీమ్‌తో అద్భుత ప్రయోజనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook