Dry Dates Boiled In Milk Benefits: ప్రస్తుతం మారిన ఆహార అలవాట్లకు తగినట్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ.. తమ ఆరోగ్యానికి ఏది మంచిదైతే అది మాత్రమే తింటున్నారు. పాలు, ఖర్జూరం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది పాలు, ఖర్జూరాన్ని వేర్వేరుగా తీసుకుంటారు. కానీ రెండు పాలలో ఖర్జూరాన్ని మరిగించి ఎప్పుడైనా తీసుకున్నారా..? పాలలో ఖర్జూరాన్ని కలిపి.. వేడి చేసుకుని తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండింటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుందని అంటున్నారు. అంతేకాదు రక్తహీనత తొలగిపోతుందని.. ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని చెబుతున్నారు. ఖర్జూరాన్ని పాలలో మరిగించి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి..? పూర్తి వివరాలు ఇలా..


పాలలో ఉండే పోషకాలు ఇవే..


==> పాలలో ప్రొటీన్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.


ఖర్జూరంలోని పోషకాలు ఇవే..


==> ఖర్జూరంలో ఫైబర్, కార్బొహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి, కాపర్, జింక్, ఐరన్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి.


పాలు-ఖర్జూరం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు


బలహీనత దూరం..


==> మీరు బలహీనంగా ఉన్నట్లయితే.. మీరు పాలలో ఉడికించిన ఖర్జూరాలను తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉండే ప్రొటీన్లు, ఐరన్, కార్పొహైడ్రేట్లు శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.


బరువు పెరిగేందుకు..


==> మీరు తక్కువ బరువుతో ఇబ్బంది పడుతుంటే.. పాలలో ఉడికించిన ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.


ఎముకలను దృఢంగా చేయడంలో..


==> వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం సహజం. పాలల్లో ఖర్జూరం మిక్స్ చేసి తింటే మేలు జరుగుతుంది. ఈ మిశ్రమంలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో.. దృఢంగా ఉంచడంలో సహాయ పడతాయి. 


చర్మం మెరిసేందుకు


==> పాలల్లో ఖర్జూరాన్ని మరిగించి తింటే.. చర్మానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో..  మెరిసేలా చేయడంలో సహకరిస్తుంది.


హిమోగ్లోబిన్ పెంపునకు..


==> మీ బాడీలో బ్లెడ్ తక్కువగా ఉంటే.. పాలలో ఉడికించిన ఖర్జూరాలను తీసుకోవాలి.  ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగించే హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. 


జీర్ణక్రియను మెరుగుదలకు..


==> పాలలో ఉడికించిన ఖర్జూరాన్ని తింటే.. జీర్ణ క్రియను ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహరిస్తాయి.


రోగనిరోధక శక్తిని పెంచడంలో..


==> రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. పాలలో ఉడకబెట్టిన ఖర్జూరం తినాలి. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సీజనల్ వ్యాధుల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. 


Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?


Also Read: Chandrababu Case: చంద్రబాబు కేసులో కీలక పరిణామాలు, అటు కస్టడీ, ఇటు బెయిల్‌పై ఉత్కంఠ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook