Health Benefits of Papaya Seeds: బొప్పాయి ఎన్నో పోషక విలువలున్న పండు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ డైట్ లో భాగంగా బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. అయితే బొప్పాయి ఫ్రూట్ తిన్న తర్వాత దాని గింజలను మనం పారేస్తాం. కానీ వీటి వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి గింజల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము మరియు కాల్షియంతో సహా అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. బొప్పాయి గింజలు మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటాయి, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. బొప్పాయి గింజల తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


బొప్పాయి గింజల ప్రయోజనాలు 
** బొప్పాయి గింజల్లో పైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో మీరు వైట్ లాస్ అవుతారు. 
** బొప్పాయి గింజల్లో కార్పెన్ అనే పదార్థం ఉంటుంది., ఇది ప్రేగులను క్లీన్  చేస్తుంది. దీంతో మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య దరిచేరదు. 
** బొప్పాయి గింజల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. ఒలీక్ యాసిడ్ మరియు ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
** బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని అనేక రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది.
** బొప్పాయి గింజల్లో విటమిన్ సి మరియు ఇతర సమ్మేళనాలు (ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫెనాల్స్) పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. 


Also Read: Fenugreeks Benefits: మెంతులతో మైండ్ బ్లాక్ అయ్యే బెనిఫిట్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook