Health Care Tips for Winter:  దేశంలో రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉంటుంది. చలికాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇట్టే వ్యాధులు బారిన పడతారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలికాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీరు బయట తిరగకపోవడం మంచిది. మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. వింటర్ లో ఎక్కువగా టైఫాయిడ్‌, డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా తదితర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రతలు:
చలికాలంలో మంచులో ఎక్కువగా తిరగడం, బయట పుడ్ తినడం మంచిది కాదు. ఈ సీజన్ లో  ఏసీలు, ప్యాన్లు, కూలర్లు వాడకం వీలైనంత వరకు తగ్గించాలి. జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. డైలీ వ్యాయామం చేయండి. ఎక్కువగా వేడి నీటిని, వేడి ఆహారాన్ని తీసుకోవడానికే ప్రయత్నించండి. ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. దోమల రాకుండా చర్యలు తీసుకోండి. కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీంలకు దూరంగా ఉండండి. హార్ట్ ఫేషెంట్స్ ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, సమయానికి మందులు వేసుకోవాలి. ఆస్థమా ఉన్నవారు చాలా కేర్ పుల్ గా ఉండాలి. బైక్ పై వెళ్లేటప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు గ్లౌజ్స్, స్కార్ప్‌, జర్కిన్‌, హెల్మెట్‌ వంటివి వాడండి. పొగ మంచులో వాకింగ్, జాగింగ్ చేయడం మానుకోండి. ఈ సమయంలో పౌష్టికాహారం, రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్‌ తీసుకోండి. 


Also Read: New Year 2024: న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఇంతకన్నా మంచి ప్లేసెస్ ఉండవు..


Also Read: Honey with Garlic: రోజూ పరగడుపున ఈ మిశ్రమం తీసుకుంటే మెరుపువేగంతో బరువు తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి