Anti Ageing Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుంటారు. కొన్ని సూచనలు పాటిస్తే కచ్చితంగా నిత్య యౌవనంగా కన్పించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి జీవితంలో ఏజీయింగ్ అనేది ఓ సహజమైన ప్రక్రియ. వయస్సు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం లేదా కాంతి కోల్పోవడం వంటి మార్పులు సంభవిస్తూ వృద్ధాప్యం కన్పిస్తుంటుంది. అయితే ఇటీవల తక్కువ వయస్సుకే ఈ పరిస్థితి తలెత్తుతోంది. కారణం లైఫ్‌స్టైల్. హెల్తీ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై, ఏజీయింగ్ ప్రక్రియపై ప్రభావం త్వరగా కన్పిస్తోంది. వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. ముఖ్యంగా అలసట, ముడతలు, బలహీనత, ఎముకల నొప్పి వంటివి ఇందులో ప్రధానమైనవి. అందుకే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.


మనిషికి అన్నింటికంటే ప్రధానంగా ఉండవల్సింది సరైన నిద్ర. నిద్ర తక్కువైతే నిర్ణీత సమయం కంటే ముందే వృద్ధాప్యం కన్పిస్తుంది. ఒత్తిడి పెరగడం, ఇమ్యూనిటీ బలహీనం కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అందుకే రోజూ రాత్రి వేల 7-9 గంటలు ప్రశాంతమైన నిద్ర తప్పకుండా ఉండాలి. అప్పుడే మనిషి ఉల్లాసంగా ఉండటమే కాకుండా జీవక్రియ మెరుగుపడుతుంది. 


ఇక ముఖ్యమైన మరో విషయం ఏదైనా ఒత్తిడితో బాధపడుతుంటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చేస్తాయి. ఒత్తిడి దూరం చేసేందుకు మెడికేషన్, శ్వాస గట్టిగా తీసుకుని వదలడం, యోగా వంటి చిట్కాలు పాటించాలి. వీటివల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఆందోళన తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 


రోజువారీ జీవితంలో డైట్ సమతుల్యంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ ఫుడ్స్, తృణ ధాన్యాలు రోజూ డైట్‌లో తగిన మోతాదులో ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. 


రోజూ తగినంత సమయం వ్యాయామానికి తప్పకుండా కేటాయించాలి. వాకింగ్ లేదా యోగా కూడా అలవర్చుకోవచ్చు. శారీరక శ్రమ ఉంటే కండరాలకు బలం, గుండె ఆరోగ్యం అన్నీ ఉంటాయి. మరీ ముఖ్యంగా శరీరంలో ఎండోఫిన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం వల్ల మూడ్ బాగుంటుంది. రోజూ కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలి. 


శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. శరీరం హైడ్రేట్‌గా ఉండటం వల్ల శరీరంలోని విష పదార్ధాలు ఎప్పటికప్పుడు బయటకు తొలగిపోతాయి. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంటుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. 


Also read: Immunity Foods: సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందా, ఈ 5 పదార్ధాలు డైట్‌లో ఉంటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook