Healthy Diet In Winter: శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే..వీటితో ఇన్ఫెక్షన్ల సైతం దూరం..
Healthy Diet In Winter: శీతాకాలంలో చాలామంది తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆహార పదార్థాలను వినియోగించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
Healthy Diet In Winter: చలికాలంలో తేమ పెరగడం కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఈ సమయంలో చక్కెరతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ తినడం వల్ల దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఈ వ్యాధుల కారణంగా చాలామందిలో రోగనిరోధక శక్తి కూడా సులభంగా తగ్గుతుంది. అయితే ఇలాంటి సమయంలో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. కాలంలో ఏయే ఆహారాలు ప్రతిరోజు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం:
చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి ఇందులో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అంతేకాకుండా మహిళల్లో ఎదురయ్యే రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. చలికాలంలో చాలామందిలో జీర్ణ క్రియ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి కూడా బెల్లం సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా దూరమవుతాయి.
నెయ్యి:
నెయ్యి కూడా శీతాకాలంలో శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నెయ్యిని ప్రతిరోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా సులభంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దగ్గు నుంచి కూడా సులభంగా ఉపశమనం తగ్గిస్తుంది. శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో నెయ్యిని వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం
తేనె:
శీతాకాలంలో జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తేనెను ప్రతిరోజు వినియోగించాల్సి ఉంటుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.
అల్లం:
శీతాకాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు అల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని రక్త పరిమాణాలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు అల్లాన్ని ఆహారంలో తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.