దేశీయ మార్కెట్లలో అధికంగా లభ్యయ్యే కాయగూరల్లో క్యాప్సికం ఒకటి. 'బెంగళూరు మిర్చి' అని దీనికి పేరు. బయట మార్కెట్లో ఇది వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఎరుపు, ఆరెంజ్, ఎల్లో రంగుల్లో కనిపించినా..  ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాప్సికంను మాత్రమే ఎక్కువగా కూరల్లో వాడుతాము. ఒకరోజులో శరీరానికి కావాల్సిన 'సి' విటమిన్ ను ఒక్క క్యాప్సికం మాత్రమే అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇదేకాదు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం..! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* క్యాప్సికం నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది. 


* జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. డయేరియా, పొట్ట అల్సర్ ను దూరం చేస్తుంది. 


* ఇందులో ఏ, సి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 'ఏ' విటమిన్  వల్ల  కంటి సమస్యలు నివారించవచ్చు. 


* రోజువారీ ఆహారంలో క్యాప్సికం ను చేర్చుకుంటే సౌదర్యం పెరుగుతుంది. మొఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. 


* బరువు, మధుమేహం నియంత్రణలో ఉంచడానికి, జుట్టు రాలిపోకుండా ఉండటానికి క్యాప్సికం తీసుకుంటే మంచిది. 


* క్యాప్సికంలో ఉండే ‘కేయాన్’ మూలకం పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం దీంతో తయారుచేసిన ఆయింట్మెంట్ ను పెయిన్ రిలీఫ్ వాడుతున్నారు 


* క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న మూలకాలు రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.