Menustrual Health: మహిళల్లో రుతుచక్రం సాధారణమే అయినప్పటికీ దీనివల్ల కలిగే పెయిన్ భరించలేనిది. ప్రతినెలా ఇది ఓ పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాదు డైలీ రొటీన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.బీడీఎస్, పీజీడీసీసీ డాక్టర్ గార్గీ ఖొక్కర్ కొన్ని నేచురల్ హోం రెమిడీస్ ను షేర్ చేశారు. దీంతో పీరియడ్ పెయిన్ నుంచి తక్షణమే రిలీఫ్ పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్టర్ ఆకాంక్ష ఖండుజా ఎంబీబీఎస్ డాక్టర్ ప్రకారం మన డైలీ డైట్ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య ఎక్కువగా ఉండదు. అంటే కాల్షియం, మెగ్నీషియం వంటివి.


పీరియడ్ సమస్యలకు 7 హోం రెమిడీస్..
అల్లం టీ..

అల్లంలో యాంటీ ఇన్ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి రుతు తిమ్మిరిని తగ్గించి పీరియడ్ పెయిన్ కూడా తగ్గించే గుణం ఉంది. అందుకే మీ పీరియడ్ సమయంలో అల్లంటీ తాగితే పీరియడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు.


దాల్చీని..
రుతుచక్రాన్ని నిర్వహించడంలో దాల్చీని సహాయపడుతుంది. ఎక్కవు బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది. మీరు తినే ఆహారంలో దాల్చీని చెక్కపొడిని యాడ్ చేసుకోవాలి. లేదా తేనె, వేడినీటితో కలిపి తీసుకున్న లాభాదాయకంగా ఉంటుంది.


ఇదీ చదవండి: మీరూ బెడ్‌పై కూర్చొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ సమస్యలు తప్పవు..


పసుపుపాలు..
పసుపులో కూడా యాంటీ ఇన్ప్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కూడా రుతుతిమ్మిరిని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు కలిపిన గోరువెచ్చని పాలను తాగితే మంచి నిద్ర కూడా పడుతుంది.


సోంపు గింజలు..
పీరియడ్ సమయంలో వచ్చే కడుపు సంబంధిత సమస్యలకు సోంపు గింజలతో చెక్ పెట్టొచ్చు.దీనికి నేరుగా మీరు సోంపును నమిలినా సరిపోతుంది. లేదా సోంపుతో తయారుచేసిన టీ తాగాతే మంచి ఉపశమనం కలుగుతుంది.


హీట్ థెరపీ..
పొత్తికడుపు కింద కాస్త కాపడం పెట్టుకున్నా కండరాలు రిలాక్స్ అవుతాయి. హీట్ ప్యాడ్, వేడినీటి స్నానం కూడా పీరియడ్ సమయంలో మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. 


ఇదీ చదవండి: మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే టిప్స్‌ ఇవే తప్పకుండా ఇలా చేయండి!


పుదీనా..
పుదీనాలో సహజసిద్ధంగా చల్లబరిచే తత్వం కలిగి ఉంటుంది. ఇది కండరాలకు ఉపశమానాన్ని ఇస్తుంది. కడుపు సంబంధిత సమస్యలకు కూడా మంచి ఉపశనం కలుగుతుంది.


అవిసెగింజలు..
అవిసెగింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడస్ పుష్కలంగా ఉంటుంది.  ఇది హార్మొనల్ అసమతుల్యత, ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తాయి. ఏదైనా స్మూథీల్లో అవిసెగింజల పొడిని కలుపుకొని తాగాలి. లేదా యోగార్ట్, ఓట్మిల్ లో కలుపుకొని తాగాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook