What fruits and vegetables are good for the heart attack patients: ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడి మరణిస్తున్నారు. 25-30 ఏళ్ల యువకులు కూడా గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు. కాబట్టి గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే.. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె పేషెంట్లు, సాధారణ ప్రజలు కూడా కొన్ని పండ్లను తింటే.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెర్రీలు:
ఇప్పటికే గుండెపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్ని రకాల బెర్రీలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా రాస్ప్బెర్రీస్ గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండెకు రక్తాన్ని చేరే సిరలు ఫిట్‌గా ఉంటాయి. 


ద్రాక్ష: 
ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలో భారీ మొత్తంలో పాలీఫెనాల్స్ మరియు ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి, దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 2.5 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.


ఆపిల్:
ఆపిల్ హృద్రోగులకు మేలు చేస్తుంది. అందుకే హృద్రోగులు తమ ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవచ్చు. నిజానికి దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. గుండె జబ్బులకు యాపిల్ దివ్యౌషధం అని నమ్ముతారు. హైబీపీ, గుండెలో బ్లాకేజీ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఒక యాపిల్‌ను తీసుకోవాలి.


నేరేడు: 
నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండు వేసవిలో ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి దొరికినప్పుడే ప్రతిరోజు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. 


పుచ్చకాయ: 
పుచ్చకాయ గుండెకు మేలు చేస్తుంది. పుచ్చకాయ హానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే గుండెపోటుకు దారితీస్తుంది.


చేపలు, కూరాగాయాలు:
గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, గ్రీన్ బీన్స్, సోయా బీన్స్, బచ్చలి కూర, పాలకూరలను నిత్యం తీసుకోవాలి. వీటిలో ఖనిజాలు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి 2-3 సార్లు చేపలు తీసుకోవాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను పదిలంగా ఉంచుతాయి. తృణధాన్యాలను తీసుకోవడం కూడా చాలా మంచిది. బ్లాక్ టీ, గ్రీన్ టీ గుండె సమస్యలను 20 శాతం వరకు తగ్గిస్తుంది. 


Also Read: Viral Video: ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ.. పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసింది!


Also Read: Thomas Cup 2022: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 73 ఏళ్ల త‌ర్వాత..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.