Winter Risk: మనిషి సగటు ఆరోగ్యం బాగుండేది వేసవిలోనే. వర్షాకాలం, శీతాకాలంలో రోగాలు అధికం. శీతాకాలమొచ్చిందంటే జలుబు, జ్వరాలే కాదు..ప్రాణాల్ని హరించే గుండెపోటు సమస్యలు కూడా వెంటాడుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వీడన్‌కు చెందిన లండ్ యూనివర్శిటీ పరిశోధనలు ఆందోళన కల్గిస్తున్నాయి. చలికాలంలో ప్రాణాంతకమైన సమస్యలు వెంటాడుతాయని..జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జలుబు, జ్వరం వంటి తేలికపాటి ఆరోగ్య సమస్యలు శీతాకాలంలో సహజమే. అయితే గుండెపోటు వంటి సమస్యలు కూడా శీతాకాలం కారణంగా తలెత్తే ప్రమాదముందనేది తాజా పరిశోధనల సారాంశం. శీతాకాలంలో ఉష్ఘోగ్రత సున్నా కంటే కిందకు పడిపోయినప్పుడు...ఒక్కరోజులోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువౌతుందని పరిశోధకులు చెబుతున్నారు.


వాతావరణంలో ఉష్ణోగ్రత వేగంగా తగ్గడానికి, గుండె జబ్బులకు సంబంధముందని పరిశోధకులు తేల్చారు. సాధారణ పరిస్థితుల్లో కంటే ఉష్ణోగ్రత జీరో కంటే తక్కువకు పడిపోయినప్పుడు గుండెపోటు ముప్పు నాలుగురెట్లు అధికమౌతుందంటున్నారు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం, చలిగాలులు ఎక్కువగా ఉండటం, వాతావరణంలో తేమ కారణంగా శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఆ ప్రభావం శరీరంలోని అవయవాలపై తీవ్రంగా పడుతుంది. దీంతో రక్తనాళాలు చలికి సంకోచిస్తాయి. ఫలితంగా ధమనుల్లో రక్తపోటు పెరిగి తీవ్రమైన వణుకు, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలుంటాయని లండ్ యూనివర్శిటీ పరిశోధనల్లో గుర్తించారు. అందుకే గుండె సంబందిత(Heart Attack Problems) సమస్యలున్నవాళ్లు..సాధ్యమైనంతవరకూ వెచ్చటి వాతావరణంలో ఉండటమే మంచిది. 


Also read: Neem Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.