Healthy Tips Prevents Heart Attacks: చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అనారోగ్యకరమైన, క్రమరహిత జీవనశైలి ఇందుకు కారణమవుతోంది. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది : 


గుండెకు రక్త సరఫరా జరిగే రక్త నాళాల్లో రక్తం గడ్డం కట్టినా, కొలెస్ట్రాల్ కారణంగా అది మూసుకుపోయినా రక్త ప్రవాహం నిలిచిపోయి గుండెపోటు వస్తుంది. ధూమపాన అలవాటు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే.. అంటే గోల్డెన్ అవర్‌లోనే ఆసుపత్రిలో చేరితే ప్రాణాలకు ముప్పు తక్కువగా ఉంటుంది. ఆలస్యమయ్యే పక్షంలో ప్రాణాలకు ముప్పు పెరుగుతుంది.


భారతీయుల్లో జన్యుపరమైన కారణాలు కూడా గుండెపోటుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం, స్మాల్ హార్ట్ వెజెల్స్, త్వరగా డయాబెటీస్ బారినపడే రిస్క్, ఒబెసిటీ, హై బీపీ, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర వంటివి ఎక్కువగా తీసుకోవడం గుండెపోటుకు కారణమని చెబుతున్నారు.


ఈ నియమాలు పాటిస్తే గుండె పదిలం :


కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌తో కూడిన హార్ట్ ఫ్రెండ్లీ డైట్, తక్కువ ఆయిల్‌తో వండిన పదార్థాలు తీసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, ఫ్రోజెన్ ఫుడ్స్ తీసుకోవద్దు.


రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కనీసం రోజూ 30 నిమిషాల కాలి నడక ఉండాలి. వారానికి కనీసం 150 నిమియాలు వాక్ చేయాలి. తద్వారా హై బీపీ, డయాబెటీస్, హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.


ఎట్టి పరిస్థితుల్లో ఆల్కాహాల్ తీసుకోకూడదు.


ఎట్టి పరిస్థితుల్లో పొగాకు లేదా పొగాకు ఉత్పత్తులు తీసుకోవద్దు.


యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. గార్డెనింగ్, స్విమ్మింగ్ లేదా మీకు ఉపశమనం కలిగించే పనులు చేయాలి.


ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడితో సతమతమవుతున్నారు. దాన్ని సరిగా డీల్ చేయగలిగితే అనారోగ్యం బారినపడే ముప్పు తప్పుతుంది.


గుండ్ జబ్బుల గురించి తగిన అవగాహన కలిగి ఉండాలి. లక్షణాలను ముందే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. త్వరగా లక్షణాలు గుర్తించినట్లయితే రిస్క్ తప్పుతుంది. 


Also Read: Flipkart Offers: శాంసంగ్ రెడీ LED టీవీ మరి ఇంత డెడ్ చీపా..? రూ. 3,990లకే టీవీ.!


Also Read: Samsung Smart TV: బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ఫీచర్స్.. 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook