Heart Attack: హార్ట్ ఎటాక్ ముందు తప్పకుండా ఈ సంకేతాలుంటాయి..తస్మాత్ జాగ్రత్త
Heart Attack: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె పదిలంగా ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అదే సమయంలో గుండెపోటు వచ్చే ముందు మన శరీరం తప్పకుండా సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.
Heart Attack: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె పదిలంగా ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అదే సమయంలో గుండెపోటు వచ్చే ముందు మన శరీరం తప్పకుండా సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.
జీవితపు ప్రతి దశలో ప్రమాదాలు ఉండనే ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకే జీవితంలో చాలా అప్రమత్తత అవసరం. లేకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో..ఏమౌతుందో ఎవరూ చెప్పలేరు. గుండెపోటు కూడా అటువంటిదే. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అయితే..జీవితంలో కొన్ని తప్పులు, కొన్ని ఒప్పులు ఎప్పుడూ వివిధ రకాలుగా సంకేతాలిస్తూనే ఉంటాయి. గుండెపోటు వచ్చేముందు కూడా మన శరీరం కొన్ని రకాల సంకేతాల్ని ఇస్తుంది. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం..
హార్ట్ ఎటాక్‌కు ముందు సంకేతాలు
నిద్రలో అసౌకర్యం అనేది సామాన్యమైన లక్షణం. ఒకవేళ మీ హార్ట్ బ్లాకేజ్ అవుతుంటే లేదా గుండెపై ఒత్తిడి పెరుగుతుంటే లేదా పట్టేసినట్టుంటే ఆ సంకేతాల్ని వెంటనే పసిగట్టాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభవం ఉంటుంది. కొందరికి ఛాతీ బరువుగా ఉన్నట్టుంటుంది. చాలా బరువుగా అనుభవమౌతుంటుంది. ఇంకొంతమందికి ఛాతీలో గుచ్చినట్టుంటుంది. మరి కొందరికి ఛాతీలో మంట ఉంటుంది.
శ్వాసలో ఇబ్బంది
కొందరికి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే..రోజుకు 2-3 అంతస్థులు ఎక్కి దిగినా లేని ఇబ్బంది సాధారణ సమయాల్లో వచ్చిందంటే హార్ట్ ఎటాక్ లక్షణంగా భావించాలి.
వాంతులు, ఆందోళన
గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలు ఒక్కోసారి ఇతర అనారోగ్య సమస్యలున్నప్పుడు కూడా కన్పిస్తుంటాయి. అందుకే వైద్యుడిని సంప్రదిస్తే సమస్యేంటనేది నిర్ధారణౌతుంది. వాంతులు వచ్చినా లేదా తల తిరుగుతున్నా హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు.
గొంతులో నొప్పి
గొంతులో లేదా దవడలో నొప్పిగా ఉంటే గుండె నొప్పి కావచ్చు కానీ నూటికి నూరుశాతం కాదు. అదే సమయంలో గుండె మధ్యలో ఒత్తిడిగా ఉంటే హార్ట్ ఎటాక్ లక్షణమే అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also read: Medicines Banned: జింటాక్, ర్యాంటాక్ మందులతో కేన్సర్, 26 మందుల్ని నిషేధించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook