Heel Pain: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది నడుస్తున్నప్పుడు మడమలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పిలకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నొప్పి తీవ్రత అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది.  ఈ సమస్య నుంచి విముక్తి ఎలా పొందాలో తెలుసుకుందాం. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడం, శరీరంలో రక్త సరఫర ఆగిపోవడం వంటి సమస్యల కారణంగా అకస్మాత్తుగా మడమ నొప్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందండి:


మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ముందుగా నొప్పి ఉన్న చోట చేతి వేళ్లను ఉపయోగించి మసాజ్ చేయండి. ఆ తర్వాత మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఆయుర్వేద మూలికలతో చేసిన నూనెను నొప్పి ఉన్న చోట పూసి నెమ్మదిగా మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల  నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.


ఇలా చేయండి:


1. రెండు చేతుల బొటన వేళ్లతో మడమపై  మసాజ్ చేయండి.
2. పిడికిలిని ఉపయోగించి మడమపై రుద్దండి. దీంతో మీరు తక్షణ ఉపశమనం పొందుతారు.


ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి:


- మసాజ్‌తో మడమ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందనే గ్యారెంటీ లేదు. కావున ఖచ్చితంగా కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మేలు.


- మసాజ్ చేసే క్రమంలో ఐస్‌ ముక్కలను ఉపయోగించవచ్చు. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.


- మసాజ్‌ను 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే చేయాలి.


- టెన్నిస్ లేదా క్రికెట్ బాల్‌ను కూడా ఉపయోగించి మసాజ్ చేయోచ్చు.


- అధిక నొప్పి ఉన్నప్పుడు వైద్యుడుని సంప్రదించడం  మేలు.


 


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Mosquito Repellent: దోమల బెడద ఉందా..మీ ఇంటి చుట్టూ 5 రకాల మొక్కలను నాటండి..!!


Also Read: Mosquito Repellent: దోమల బెడద ఉందా..మీ ఇంటి చుట్టూ 5 రకాల మొక్కలను నాటండి..!!


థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి