Hemoglobin: మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో అత్యంత కీలకమైంది హిమోగ్లోబిన్, రక్తంలో తప్పకుండా ఉండాల్సిన పోషకమిది. మనిషి ప్రాణాన్ని నిలబెట్టే ఆక్సిజన్‌ను శరీరంలోని ప్రతి అంగానికి చేర్చడంలో హిమోగ్లోబిన్ పాత్ర కీలకమైంది. అందుకే హిమోగ్లోబిన్ తగ్గితే ఆ ప్రభావం నేరుగా ఆక్సిజన్ సరఫరాపై పడుతుంది. ఇది ప్రమాదకరం కావచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే అతి ముఖ్యమైంది హిమోగ్లోబిన్. రక్తంతో హిమోగ్లోబిన్ తగిన పరిమాణంలో ఉంటేనే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే శరీరంలో ప్రతి అంగానికి కావల్సినంత ఆక్సిజన్ సరఫరా అయ్యేట్టు చేసేది ఇదే. ఒకవేళ హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఆ ప్రభావం నేరుగా ఆక్సిజన్ సరఫరాపై పడుతుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే హిమోగ్లోబిన్ అనేది చాలా కీలకమైంది. 


శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి వివిద ఇతర పోషకాలు దోహదం చేస్తాయి. ఇందులో ముఖ్యమైంది విటమిన్ ఎ. విటమిన్ ఎ తగిన పరిమాణంలో ఉంటే రక్తంలో ఐరన్ కొరత తీర్తుంది. అందుకే విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తరచూ తీసుకోవాలి. దీనికోసం చేపలు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. చేపల్లో విటమిన్ ఎ తగిన పరిమాణంలో ఉంటుంది. శాకాహారమైతే క్యారట్, చిలకడదుంపను డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.


రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండాలంటే ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. హిమోగ్లోబిన్ లోపాన్ని దూరం చేసేందుకు ఐరన్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. కాలిఫ్లవర్, అరటి, పాలకూర వంటివి మంచి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. రోజూ డైట్‌లో ఇవి ఉంటే ఐరన్ లోపం తలెత్తదు. 


ఇక హిమోగ్లోబిన్ పెంచడంలో దోహదపడే మరో ముఖ్య పోషకం ఫోలేట్. దీనినే విటమిన్ బి అని కూడా అంటారు. విటమిన్ బి లోపముంటే కణజాలంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఫోలేట్ అవసరం. దీనికోసం మటర్, మసూర్ దాల్, రాజ్మా వంటివి డైట్‌లో ఉండాలి.


Also read: Sleep deficiency: నిద్రకి బరువుకి ఉన్న సంబంధం ఏమిటి.. తక్కువ నిద్రపోతే ఏమవుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook