Hemoglobin Levels Boost In 5 Days: చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల రక్తంలోని  హీమోగ్లోబిన్ మోతాదు విలువల కన్నా తగ్గుతున్నాయి. అయితే ఇలా తగ్గడం వల్ల రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. రక్తహీనత సమస్యల వల్ల శరీరంలో  ఎర్ర రక్త కణాల సంఖ్యం కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలు  రక్తహీనత సమస్యల బారినపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలో  హీమోగ్లోబిన్ పెరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో తీసుకోండి:


క్యారెట్:
రక్తహీనత అనేది ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య బారిన చాలా మంది మహిళలు పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి..హిమోగ్లోబిన్ పెంచడానికి  క్యారెట్స్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ కె, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను జ్యూస్‌లా చేసుకుని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సులభంగా పెరుగుతాయి. కాబట్టి ఇలా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఖర్జూరాలు:
ఖర్జూరాలల్లో హిమోగ్లోబిన్‌ను పెంచే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగిస్తే బరువు తగ్గడమేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్‌ సమస్యలు కూడా సులభంగా దూరమవుతుంది. ఇందులో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బి6, పిరిడాక్సిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని కూడా పెంచేందుకు సహాయపడతాయి.


స్ట్రాబెర్రీ:
శరీరానికి స్ట్రాబెర్రీలు చాలా అవసరం. ఇందులో బాడీకి కావాల్సిన విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ఆహారాల్లో వినియోగిస్తే కొలెస్ట్రాల్‌ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా హిమోగ్లోబిన్ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


పుచ్చకాయ:
పుచ్చకాయలో ఐరన్ పరిమాణాలు అధిక పరిమాణంలో ఉంటుంది. ఇందులో 91 శాతం నీరు, 6 శాతం చక్కెర, కొవ్వుల పరిమాణాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు A, B6, C  బీపీ, యూరిక్ యాసిడ్ వంటి సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా హిమోగ్లోబిన్ సమస్యలతో బాధపడుతున్నవారికి దివ్యౌషధంలా పని చేస్తుంది.


బాదంపప్పు:
హిమోగ్లోబిన్ సమస్యలతో బాధపడుతున్న మహిళలు తప్పకుండా నీటిలో నానబెట్టిన బాదంపప్పు ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, కాల్షియం, పొటాషియం శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.


టొమాటో:
టొమాటోలో కూడా ఐరన్ పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, ఆల్ఫా టోకోఫెరోల్, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే హిమోగ్లోబిన్ సమస్యల తగ్గుతాయి. శరీరంలో రక్త పరిమాణం కూడా పెరుగుతుంది.


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి