Henna for Hair: జుట్టుకు హెన్నా రాసుకునే వాళ్లు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి!
Henna for Hair: ప్రస్తుతం మనలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్య ఎదురవుతుంది. అలాంటి క్రమంలో చాలా మంది జుట్టుకు హెన్నాను అప్లే చేస్తున్నారు. అయితే తలకు హెన్నాను రాసుకోవడంలో అనేక మంది అపోహలను నమ్ముతున్నారు. ఆ అపోహలేంటో మీరూ తెలుసుకోండి.
Henna for Hair: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడే సమస్య ఎదురవుతుంది. అటువంటి పరిస్థితిలో కొంతమంది ఈ సమస్య నుంచి బయటపడటానికి జుట్టుకు గోరింటను పూసుకుంటారు. అయితే చాలా మందికి మెహందీని అప్లై చేయడం గురించి వివిధ ఆలోచనలు ఉన్నాయి. అంతే కాకుండా జుట్టులో హెన్నాను పూసుకోవడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రజల్లో కొంత అపోహ ఉంది. అలాంటి అపోహల గురంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టును నల్లగా మారుస్తుంది!
హెన్నాను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఎర్రగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే గోరింట పెట్టడం వల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. అయితే దీని కోసం మీరు గోరింటలో కొన్ని ఇతర వస్తువులను కలపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఫలితం పొందుతారు.
గోరింటాకులో నిమ్మరసం
హెన్నాను జుట్టులో అప్లే చేసే ముందు అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలపాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ప్రజలలో ఒక అపోహ కూడా ఉంది. అయితే ఇది మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. చర్మంపై మరకలాగా కనిపిస్తుంది.
డికాషన్ తో కలిపితే..
గోరింటాకు నీళ్లలో కలిపితే చాలని చాలా మంది నమ్ముతారు. కానీ అందులో ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు మెహందీ జుట్టుకు రాసే ముందు కాఫీ డికాషన్ ను కూడా కలిపితే మీరు మంచి ఫలితాలను పొందుతారు.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Muskmelon Benefits: కర్బూజతో ఎన్నో ప్రయోజనాలు.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఇలా చేయండి!
Also Read: Sugarcane Juice Benefits: వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook