Reduce Belly Fat: ఈ హెర్బల్ డ్రింక్‌తో బెల్లీ ఫ్యాట్ తగ్గి.. జీరో సైజ్ నడుము మీ సొంతం!
Herbal Tea For Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింద పేర్కోన్న హెర్బల్ డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Herbal Tea For Belly Fat: ఒక రాత్రికి రాత్రే శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ మొత్తం తగ్గాలి అంటే తగ్గలేరు. ఎందుకంటే శరీర బరువు తగ్గించుకోవాలంటే తప్పకుండా శరీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు వ్యాయామాలు, వాకింగ్ చేయాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు వేగంగా తగ్గడానికి తప్పకుండా పలు రకాల ఇంటి నివారణలు పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన సింపుల్ హోం రెమెడీస్‌తో సులభంగా బరువు తగ్గడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే దీని కోసం మీరు ప్రతి రోజూ తేనె, దాల్చిన చెక్కలతో తయారు చేసి హెర్బల్ టీలు తాగాల్సి ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెల్లీ ఫ్యాట్‌ను కూడా తగ్గిస్తుందా?:
తేనె, దాల్చినచెక్కలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా దీనితో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ వ్యాధులను కూడా సులభంగా దూరం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొదండానికి తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహానికి కూడా చెక్:
ఆధునిక జీవన శైలి కారణంగా మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తేనె, దాల్చిన చెక్కలతో తయారు చేసిన టీలను తాగాలి. ఎందుకంటే ఇందలో శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయి. అంతేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతన్నవారికి కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం:
>>ముందుగా ఒక కప్పు నీటిని మరిగించండి. అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి.
>>ఇలా పొడి వేసిన తర్వాత నీటిని బాగా మరించాల్సి ఉంటుంది.
>>బాగా మరుగుతున్న నీటిలోనే రుచికి సరిపడ తేనె వేసుకుని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
>>ఇలా మరిగిన టీని ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుని పై నుంచి పూదినా ఆకులను వేసుకోవాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా కావాలనుకుంటే అందులో యాలకులను కూడా వేసుకోవచ్చు.
>>ఇలా తయారు చేసిన టీని ప్రతి రోజూ రెండు సార్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలతో బెల్లీ ఫ్యాట్ మాయం.
Also Read: Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook