COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diet For High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి శరీరంలో వాటర్‌ లెవల్స్‌ తగ్గిపోయి.. హైడ్రేషన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్య కారణంగా చాలా మందిలో అధిక రక్తపోటు సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేసవి కాలంలో అధిక రక్తపోటు సమస్యల రెట్టింపు అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు ఈ కింది ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.     


అరటిపండ్లు:
వేసవిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా ఉదయం ఆహారంలో అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలంగా తయారవుతుంది. దీని కారణంగా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. 


పెరుగు:
పెరుగులో కూడా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు పెరుగును తీసుకుంటే సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. 


దానిమ్మ:
దానిమ్మను కూడా ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి రక్తపోటుతో బాధపడేవారు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నార్మల్‌ అవుతుంది. దీంతో పాటు గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 


కొబ్బరి నీరు:
అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పూట కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. 


పుచ్చకాయ:
ప్రతి రోజు పుచ్చకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో 80 నుంచి 90 శాతం నీరు లభిస్తుంది. కాబట్టి ఇది హైబీపీని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


నిమ్మకాయ:
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. కాబట్టి నిమ్మరసం ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఫ్రి రాడికల్స్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి