High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే శక్తివంతమైన శరీరం పొందడానికి జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  లేకుంటే సమస్యలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వారు తెలుపుతున్నారు. మంచి పోషకాహారం కోసం  ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ పండ్లు బీపీ పెరిగిన సందర్భంలో నియంత్రించేందుకు కూడా కృషి చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అలాంటి పండ్లు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండు హైబీపీని కూడా నియంత్రిస్తుంది:


అరటిపండులో చాలా రకాల పోషక విలువలుంటాయి. ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈ పండులో ఉండే గుణాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అధిక బీపీతో బాధపడుతున్న వారు అరటి పండును క్రమం తప్పకుండా తినాలని నిపుణులు తెలుపుతున్నారు.


యాపిల్‌తో బీపీ కంట్రోల్‌:


యాపిల్‌ పండును ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తింటే.. శరీర సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా హై బీపీ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా యాపిల్ ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


కివీ పండు వల్ల శరీరానికి చాలా లాభాలు:


కివీ పండులో చాలా రకాల పోషక విలువలుంటాయి.  కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా అధిక బీపీ కూడా నియంత్రిస్తుంది. ఈ పండు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.


(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)


Also Read: Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!


Also Read: Blood Group vs Heart Risk: ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు ముప్పు ఎక్కువో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.