Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే
Cholesterol Signs: శరీరంలో అన్ని వ్యాధులకు మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌ను నియంత్రించకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటారు ఆరోగ్య నిపుణులు.
Cholesterol Signs: సాధారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ఉంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టే అర్ధం. కొన్ని సందర్భాల్లో స్థూలకాయం లేకున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం వివిధ రూపాల్లో లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే వీటిని సకాలంలో గుర్తించగలగాలి. లేకపోతే ఇతర సమస్యలకు కారణమౌతుంది.
కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కాళ్ల వరకూ రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా ఆక్సిజన్ అందని కారణంగా కాళ్లలో నొప్పి తీవ్ర సమస్యగా మారుతుంది. కాళ్లు బరువుగా ఉండటం, అలసినట్టుండటం కన్పిస్తుంది. లైట్ వాకింగ్ కూడా కష్టమౌతుంది.
ఇక కొంతమందికి రాత్రి పడుకునేటప్పుడు కాళ్లలో క్రాంప్స్ సమస్య తలెత్తుతుంది. అంటే నొప్పి ఉంటుంది. అంటే శరీరంలోని దిగువ భాగంలో నరాలకు డ్యామేజ్ అవుతున్నట్టు అర్ధం. పాదాలు, కాలి వేళ్లలో కూడా క్రాంప్స్ వస్తుంటాయి. నొప్పి కారణంగా నిద్ర కూడా సరిగ్గా పట్టదు. చలికాలంలో కాళ్లు చల్లబడటం సహజమే. కానీ కొంతమందికి ఒక్కోసారి వేడిగా ఉన్నప్పుడు కూడా కాళ్లు చల్లబడుతుంటాయి. ఇలా ఉందంటే ఏదో సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకున్నట్టు అర్ధం. మెడికల్ చెకప్ అవసరం.
చెడు కొలెస్ట్రాల్ కారణంగా కాళ్ల వరకూ రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా కాళ్లపై, కాలి చర్మంపై స్పష్టంగా కన్పిస్తుంది. రక్తం తక్కువ కావడంతో చర్మం, గోర్లు రంగు మారతాయి. ఎందుకంటే ఆయా భాగాలకు రక్తం ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్, న్యూట్రియంట్ల సరఫరా తగ్గిపోతుంది.
Also read: Union Budget 2024: ఉద్యోగులకు శుభవార్త, స్టాండర్డ్ డిడక్షన్ 1 లక్ష రూపాయలకు పెరగనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook