High Cholesterol Food Should Avoid: మంచి కొలెస్ట్రాల్‌ మన శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఇది శరీర కణాల నిర్మాలకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీర అభివృద్ధకి కూడా మంచి కొలెస్ట్రాల్‌ సహాయపడుతుంది. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర వ్యాధులైన గుండెపోటు, బీపీ, మూత్రపిండాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన పలు ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహారాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది:


బిస్కట్:
శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరగడానికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. అయితే ప్రతి రోజు బిస్కట్స్ తినేవారిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కుకీలలో ట్రాన్స్ ఫ్యాట్ కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


కేక్‌లు:
చాలా మంది ప్రస్తుతం  ప్యాక్ చేసిన కేక్‌లు అతిగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్యాక్ చేసిన కేక్‌ల్లో చక్కెర పరిమాణాలు కూడా అధికంగా ఉంటున్నాయి. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Heart Health: గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే


ఫ్రోజెన్ ఫుడ్:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది ఫ్రోజెన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వీటి విక్రయిలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఇలాంటి ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్యాకెట్లలో ట్రాన్స్ ఫ్యాట్ స్థాయి అధికంగా ఉంటాయి. దీంతో వీటిని అతిగా తీసుకోవడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయోచ్చు. 


ఫ్రెంచ్ ఫ్రైస్:
ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం కూడా అతి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో హైడ్రోజనేటెడ్ కొవ్వు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా 
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీసే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.) 


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి