High Cholesterol Risk Factors: శరీరంలో కొలెస్ట్రాల్‌ రక్తం ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే అధిక కొలెస్ట్రాల్‌ను 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ 200 mg/dL కంటే ఎక్కువ ఉంటే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో పేరుకుపోవడం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీని వల్ల డైరెక్ట్‌గా స్ట్రోక్ లేదా గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ శరీరానికి ఎలా హాని చేస్తుంది?
ప్రస్తుతం చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరిగితే వారు వైద్యులను సంప్రదించినప్పుడు సాధరణ రక్త పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రరీక్షలు చేయించుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ స్థాయిల శాతం హెచ్చుతగ్గుల్లో చూపిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పూర్తీ పరీక్షను చేయించుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవడం చాలా మంచిది. 


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..! 


ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం..
అథెరోస్క్లెరోసిస్ అంటే అందరికీ తెలిసిందే..గుండెలోని ధమనులలో ఫలకం ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా రక్తం, ఆక్సిజన్  గుండె కణజాలాలకు చేరకుండా అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో తీవ్ర గుండె సమస్యలు, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లు వచ్చే అవకాశాలున్నాయి.


గుండెపోటు రావచ్చు:
శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా ధమనులు తీవ్రంగా దెబ్బతింటాయి. అంతేకాకుండా రక్త ప్రవాహంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా గుండె బలహీనంగా కూడా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


పక్షవాతానికి దారి తీయోచ్చు:
అథెరోస్క్లెరోసిస్ కారణంగా గుండెకు రక్త సరఫర తగ్గిపోయి. గుండె సామర్థ్యాన్ని విపరీతంగా తగ్గిస్తుంది. దీంతో గుండెలోనే రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మరికొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో శరీరానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరికొందరిలో స్పాట్‌లో గుండెపోటు వచ్చి మరణించే ఛాన్స్‌ కూడా ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి