High Cholesterol Symptoms: ఈ చిన్న లక్షణాలే తీవ్ర గుండెపోటుకు దారీ తియోచ్చు.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?
High Cholesterol Symptoms In Legs: చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరుగుతుంది. ఇలా పెరగడం కారణంగా అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
High Cholesterol Symptoms In Legs: మనదేశంలో ఆయిల్ ఫుడ్ తినడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ఆయిల్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. అయితే ఇలా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల చాలామందిలో సిరల్లో ఫలకం కూడా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండెపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాలను గుర్తించడానికి తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని లక్షణాల ద్వారా కూడా ఈ చెడు కొలస్ట్రాన్ని గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే:
కాలి నొప్పి:
శరీరంలో కొలెస్ట్రాల్ భారీగా పెరిగినప్పుడు.. శరీరంలో నుంచి కాళ్ళకి రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోతుంది. దీని కారణంగా కాళ్ళలో నొప్పులు, నడవలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
గోళ్ళ రంగు మారడం:
సాధారణంగా గోళ్ల రంగు లేత గులాబీ రంగులో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ భారీగా పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణలో అంతరాయం కలిగి గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
చల్లటి పాదాలు:
కొంతమందిలో చలికాలంలో కూడా పాదాలు చల్లగా మారతాయి. దీనికి ప్రధాన కారణాలు శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తితే తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లేనని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
కాలిన గాయాలను నయం కాకపోవడం:
డయాబెటిస్ ఉన్న వారిలో గాయాలు త్వరగా మానుకోవు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరికాళ్ళలో గాయాలు తగిలితే అది మానుకోవడం కన్ని సార్లు ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి మీలో కూడా ఇలాంటి సమస్య తలెత్తితే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook