COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hing Water to lose weight In 9 Days: ఊబకాయం అనేది సాధరణ సమస్య..కానీ చిన్న సమస్యే అని నెగ్లెక్ట్‌ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య కారణంగా తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది బరువు తగ్గడానికి జిమ్‌లకి వెళ్లడంతో పాటు డైటింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. వీటిని చాలా రోజులు అనుసరించిన బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే ఎలాంటి చిట్కాలను అనుసరించడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యకు చెక్‌ పెట్టొచ్చో ఇప్పుడ మనం తెలుసుకుందాం. 


బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు డైట్‌లను కూడా అనుసరించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని పాటిస్తూ ప్రతి రోజు ఇంగువ నీటిని తాగడం వల్ల శరీర బరువును ఆరోగ్యంగా తగ్గించుకోవచ్చు. ఈ నీటిలో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. 


ఇంగువలో ఉండే పోషకాలు:
ఇంగువలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, నియాసిన్, కాల్షియం, కెరోటిన్, ఫాస్పరస్, రైబోఫ్లావిన్ మొదలైనవి లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియత్రణలో ఉంటాయి. దీంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. 


బరువు తగ్గడానికి ఇంగువ నీరు ఎలా సహాయపడుతుంది:
జీర్ణక్రియను పెంచుతుంది:

ఇంగువ జీవక్రియ రేటును పెంచేందుకు ప్రభావంతంగా సహాయపడుతుందని మషాద్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఇంగువ నీటిని తాగడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఆకలి నియంత్రిస్తుంది:
ఇంగువలో ఆకలిని నియంత్రించే అనేక రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఇంగువ నీటిని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు సులభంగా బరువు తగ్గుతారు. ఈ నీటిని తాగే వారు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.


శరీరంలోని అదనపు నీటిని తొలగిస్తుంది:
ఇంగువ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల మూత్రవిసర్జన ప్రక్రియను మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా శరీరంలోని అదనపు నీటిని తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. దీని వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter