Home Remedies: చలికాలం వచ్చేసింది, సీజనల్ వ్యాధుల్నించి రక్షించే హెర్బల్ డ్రింక్స్ ఇవే
Home Remedies: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో సంరక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
సీజన్ మారగానే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా చలికాలంలో సమస్య జటిలంగా ఉంటుంది. వివిధ రకాల వ్యాధుల ముప్పు ఉంటుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చు.
చలికాలం వచ్చిందంటే చాలు వ్యాధులు ముప్పు పెరుగుతుంది. వాతావరణం మారడంతో చలి గాలుల కారణంగా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం, మెడలో గరగరగా ఉండటం వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ వ్యాధుల్నించి సంరక్షణ చాలా అవసరం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆయుర్వేద డ్రింక్స్‌తో వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు.
దాల్చినచెక్క డ్రింక్
దాల్చినచెక్కలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. దాల్చినచెక్క గుణం వేడి చేసేది కావడంతో చలికాలంలో దాల్చినచెక్కతో టీ చేసుకుని కూడా తాగవచ్చు. దాల్చినచెక్కతో ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలున్నాయి. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఎదురుకావు. చలికాలంలో ఆరోగ్యం కాపాడుకునేందుకు దాల్చినచెక్కను ఉడికించి..ఆ నీరు తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయి. దాల్చినచెక్కతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవచ్చు.
దాల్చినచెక్కతో టీ ఎలా తయారు చేయాలి
దాల్చినచెక్కతో టీ తయారు చేసేందుకు ఓ గ్లాసు నీళ్లలో దాల్చినచెక్క వేసి బాగా ఉడికించాలి.నీళ్లలో దాల్చినచెక్క రంగు, పోషకాలు సంగ్రహమైన తరువాత..వడకాచి ఆ నీళ్లను తాగాలి.
అల్లం పసుపు టీ
అల్లం, పసుపు రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఈ గుణాలు వ్యాధుల్ని దూరం చేయడంలో దోహదపడతాయి. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం, పసుపు కలిపిన టీ తాగడం వల్ల కఫం, జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఫలితంగా వ్యాధుల్ని ఎదుర్కొనే సామర్ధ్యం పెరుగుతుంది.
అల్లం, పసుపు టీ ఎలా తయారు చేయాలి
అల్లం, పసుపు కొమ్ములు తీసుకోవాలి. లేదా అల్లం, పసుపును పేస్ట్‌గా చేసుకుని నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత వడకాచి..ఇందులో కొద్దిగా తేనె కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి. పలు వ్యాధులు దూరమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook