Honey precautions: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా ఒక్క స్పూన్ తేనె కూడా విషంగా మారవచ్చు. అందుకే పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి అమృతం లాంటిది తేనె. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. చాలా రకాల అనారోగ్య సమస్యలకు తేనె పరిష్కారం. అదే సమయంలో తేనె విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఆ తప్పులు చేయకూడదు. లేకపోతే..ఒకే ఒక్క స్పూన్ తేనె సైతం విషంగా మారే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త. తేనెతో కొన్ని వస్తువుల్ని కలిపి తీసుకోవడం చాలా ప్రమాదకరం. 


చాలామందికి తేనె విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియవు. తేనెతో ఏవి కలిపి తినాలి, ఏవి తినకూడదనే విషయంపై అవగాహన ఉండదు. ఫలితంగా అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటారు. తేనెతో కలిపి ఏ వస్తువులు తీసుకోకూడదో తెలుసుకుందాం..


1. తేనెతో కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యి తీసుకోకూడదు. ఆయుర్వేదంలో సైతం ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి నష్టదాయకమని ఉంది. నెయ్యిలో చలవ చేసే గుణాలుంటే..తేనెలో వేడి చేసే గుణాలుంటాయి. ఈ రెండింటి పరస్పర వ్యతిరేక గుణాల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 


2. వేడి పాలు లేదా వేడి నీళ్లలో తేనె కలపకూడదు. చాలామంది వేడి నీళ్లలో తేనె కలిపి తాగుతుంటారు. కొంతమంది టీలో తేనె కలిపి సేవిస్తుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల తేనె గుణాల్ని కోల్పోవడమే కాకుండా..ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 


3. ముల్లంగి, కీరాతో కలిపి తేనె తీసుకోకూడదు. లేదా ఈ రెండింటికీ తేనె జోడించకూడదు. కారణం ఒకటే. ఈ రెండూ చలవ చేసేవి కాగా తేనె వేడి చేస్తుంది. చాలామంది సలాడ్‌లో తేనె కలుపుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల కడుపుపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యం సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.


Also read: Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై ఏ లక్షణాలు కన్పిస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook