Benefits of using honey with warm water: ఈ ప్రపంచంలోని చాలా మందికి కాఫీ లేదా టీ తాగకపోతే రోజు మొదలవదు. ఉదయాన్నే కాఫీ, టీ పొట్టలో పడేంతవరకు మనసులో మనసు ఉండదు. అయితే బరువు తగ్గాలనుకొనేవారు కాఫీ, టీ పక్కన పెట్టి.. తేనె తీసుకోవడంను అలవాటుగా మార్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల మీరు ఇట్టే బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకుంటే.. రోజంతా మీరు ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదనపు కొవ్వు మాయం:
తేనెలో విటమిన్ సి, విటమిన్ బి6, కార్బోహైడ్రేట్లు, అమినో యాసిడ్స్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకాహార మూలకాలు. తేనెను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ.. ఖాళీ కడుపుతోనే తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే జిమ్‌లలో బరువు తగ్గడానికి ఏవోవో చేస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తేనెను తీసుకుంటే సరిపోద్ది. ఇలా రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు తగ్గుతుంది. నిమ్మకాయ లేదా జీలకర్ర పొడిని కూడా అందులో వేసుకోవచ్చు.


దగ్గు సమస్యకు చెక్:
ఖాళీ కడుపుతో తేనె తినడం వల్ల దగ్గు సమస్యకు చెక్ పెట్టొచ్చు. గొంతు నొప్పిని నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణం కఫాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు జలుబు రాకుండా కూడా రోగనిరోధక శక్తిలా పనిచేస్తుంది. దీని కోసం మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోవాలి.


గొంతు నొప్పి మటుమాయం:
చాలా మంది గొంతు నొప్పి సమస్యతో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు ఖాళీ కడుపుతో అల్లంతో ఒక చెంచా తేనెను తీసుకోవాలి. ఇది గొంతు నొప్పికి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీరు రోజంతా ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందుతారు. మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. 


Also Read: Flipkart Offer: రెడ్‌మీ నోట్ 10sపై భారీ తగ్గింపు.. ఎగబడుతున్న జనం! లిమిటెడ్ ఆఫర్


Also Read: Video Viral: కదులుతున్న రైలులో మంటలు..ప్రయాణికుల పరుగులు..వీడియో వైరల్..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.