Weight Loss Tips: వారంలో ఎంత బరువు తగ్గడం మంచిది, ఐసీఎంఆర్ సూచనలేంటి, హెల్తీ వెయిట్ లాస్ కోసం ఏం తినాలి
Weight Loss Tips: ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఆ మనిషి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. హెల్తీ వెయిట్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. బరువు నియంత్రణ ఉండాలి గానీ క్రమపద్ధతిలో ఉండాలి. అందుకే బరువు నియంత్రణ ఎలా ఉండాలనే అంశంపై ICMR కొన్ని కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Weight Loss Tips: స్లిప్ అండ్ ఫిట్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. శరీరం బరువు పెరిగే కొద్దీ వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే సాధ్యమైనంతవరకూ బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. అదే సమయంలో స్థూలకాయంలో ఇబ్బంది పడేవాళ్లు కూడా హడావిడిగా ఒకేసారి రోజుల వ్యవధిలో బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించకూడదు.
ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని కోరుకోవడం మంచిదే. కానీ వేగంగా బరువు తగ్గించుకోకూడదు. అంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రక్రియ ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. అందుకే ఐసీఎంఆర్ కీలకమైన సూచనలు కూడా చేసింది. బరువు నియంత్రణ ఎలా ఉండాలి. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదనే మార్గదర్శకాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం స్థూలకాయం నుంచి విముక్తి పొందేందుకు, జీవనశైలి వ్యాధుల్ని దూరం చేసేందుకు ముందుగా జీవనవిధానం మార్చుకోవాలి. బీఎంఐ అనేది 23-27.5 కేజీలుంటే అధిక బరువుగా పరిగణిస్తారు. ఓ అధ్యయనం ప్రకారం అధిక బరువుతో ఉన్నవారిలో పట్టణవాసులు 30 శాతంపైగా ఉంటే గ్రామీణులు 16 శాతమే ఉన్నారు. బరువు నియంత్రణ అనేది క్రమపద్దతిలో ఉండాలి.
బరువు అనేది ఎప్పుడూ క్రమంగా తగ్గించుకోవాలి. ఒకేసారి తగ్గించే ప్రయత్నం మంచిది కాదు. వెయిట్ లాస్ డైట్ రోజుకు 1000 కిలో కేలరీలకు తక్కువ కాకూడదు. అన్ని పోషకాలు తీసుకోవాలి. అంటే వారానికి కేవలం అర కిలో బరువు మాత్రమే తగ్గడం ఆరోగ్యరీత్యా మంచిది. బరువు తగ్గించే క్రమంలో యాంటీ ఒబెసిటీ డ్రగ్స్ తీసుకోకూడదు.
హెల్తీ వెయిట్, నడుము సైజ్ సక్రమంగా ఉండేందుకు కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. అదే సమయంలో పంచదార, ప్రోసెస్డ్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ రోజూ ఎంతో కొంత ఉండాలి. యోగా, వాకింగ్ వంటివి అలవర్చుకోవాలి. రోజువారీ డైట్ అనేది బ్యాలెన్స్‌గా ఉండాలి. ఇందులో కూరగాయలు, న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఫైబర్ ఫుడ్స్ ఉండేట్టు చూసుకోవాలి.
కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించి విటమిన్లు, మినరల్స్ ఉండే ఫుడ్స్‌పై దృష్టి పెట్టాలి. ఓవర్ ఈటింగ్ లేకుండా చూసుకోవాలి. ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ లీన్ మీట్ మాత్రమే తీసుకోవాలి. స్కిన్‌లెస్ చికెన్, చేపలు తీసుకోవడం మంచిది.
సోడా, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్ సేవించకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. హెర్బల్ టీ, షుగర్‌లెస్ డ్రింక్స్ మంచివి. బేకింగ్, గ్రిల్లింగ్, స్టీమింగ్ పద్ధతుల్లో చేసే వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
Also read: Breakfast Benefits: బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయకూడదు, కలిగే లాభాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook