మీ కిడ్నీలు ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా తెలుసుకోండి
ఆధునిక జీవితశైలి, ఆహారపు అలవాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. కిడ్నీ వ్యాధికి కారణాలేంటో తెలుసుకుందాం.
ఆధునిక జీవితశైలి, ఆహారపు అలవాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. కిడ్నీ వ్యాధికి కారణాలేంటో తెలుసుకుందాం.
ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన అనారోగ్యంలో ప్రధానమైంది కిడ్నీ సమస్య(Kidney Problems). నిర్లక్ష్యం చేస్తే అతి తీవ్రమైంది కూడా. ఆదునిక జీవిత శైలిలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్ల వల్లనే కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. దేశంలో కిడ్నీ వ్యాధులు పెరుగుతుండటమే కాకుండా..కిడ్నీ మార్పిడి కేసులు కూడా అధికమవుతున్నాయి. అందుకే మూత్రపిండాలకు సంబంధించిన లక్షణాలపై ప్రజలు శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ఏదైనా సమస్య అన్పిస్తే తక్షణం చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కిడ్నీ వైఫల్యముంటే ఆ లక్షణాలు ముందు నుంచే మనిషి శరీరంలో కన్పించడం ప్రారంభమవుతుంది. సకాలంలో పట్టించుకోకపోతే కిడ్నీలు విఫలమైపోతుంటాయి. ఫలితంగా కిడ్నీ మార్పిడికి(Kidney Transplantation) దారి తీస్తుంటుంది.
కన్పించే లక్షణాలు
కిడ్నీలు విఫలమైతే లక్షణాలు(Kidney Failure Symptoms) మొదట్లోనే కనిపిస్తాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది మూత్రం ద్వారానే తెలుస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం లేదా మూత్రం రంగు మారడం ప్రధాన సంకేతాలు. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. చాలా సార్లు రోగులు కిడ్నీ విఫలమైన లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఫలితంగా వ్యాధి నివారణ అవుతుంది.
కిడ్నీ వైఫల్య లక్షణాలు ఇవే
1. తరచుగా మూత్ర విసర్జన
2. పొత్తి కడుపులో నొప్పి
3. వాంతులు, వికారం కలగడం
4. నీరసం, అలసిపోవడం
అందుకే జీవనశైలిలో ముందు మార్పులు తీసుకురావల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. కిడ్నీ వైఫల్యానికి సంబంధించి లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలి. రక్తపోటు, చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కనీసం 8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. ఏడాదికోసారి కిడ్నీ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.
Also read: How Prevent Lower Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఇలా చేస్తే నడుము నొప్పి మాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook