Vegetarian Soup For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆరోగకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంపై ప్రతి రోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తప్పకుండా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం కలిగిన ఆహారాలు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ సూప్‌లను ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. ప్రతి రోజు ఏ కూరగాయలతో తయారు చేసిన సూప్‌లు తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందో ఇప్పడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టొమాటో సూప్:
మధుమేహంతో బాధపడుతున్నవారికి టొమాటో సూప్ ప్రభావతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సూప్‌ను తయారు చేసే క్రమంలో వెల్లుల్లిని తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   


మష్రూమ్ సూప్:
తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే తప్పకుండా ఒక కప్పు మష్రూమ్స్‌ సూప్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది తయారు చేసే క్రమంలో కొలెస్ట్రాల్‌ అధిక పరిమాణంలో ఉన్న పాలను వినియోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్‌లో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. 


పప్పులతో తయారు చేసిన సూప్:
పోషకాలు అధిక పరిమాణంలో లభించే పప్పులను వినియోగించి తయారు చేసిన సూప్‌లను ప్రతి రోజు తాగడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సూప్‌ తయారి క్రమంలో ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్స్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా మధుమేహాన్ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.



(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook