Almonds Benefits: బాదం అనేది పోషకాలతో సమృద్ధిగా ఉండటంతో సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. అందుకే ప్రకృతిలో లభించే డ్రై ఫ్రూట్స్‌లో ఇది అత్యంత శక్తివంతమైనది. అయితే సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అలసట, నీరసన వంటివి దూరమౌతాయి. అయితే చాలామందికి బాదం ఎలా తినాలో తెలియదు. కొంతమంది రాత్రంతా నీళ్లలో నానబెట్టి తింటే మరి కొంతమంది తొక్క ఒలిచి తింటుంటారు. ఆరోగ్యపరంగా పూర్తి ప్రయోజనాలు పొందేందుకు బాదం ఎలా తింటే మంచిదో తెలుసుకుందాం. బాదం తొక్కల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ పెద్దఎత్తున ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి, స్వెల్లింగ్ సమస్యల్ని దూరం చేస్తుంది. అందుకే బాదం ఎప్పుడు తిన్నా తొక్కలతో తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం చాలా మంచి పద్ధతి. ప్రత్యేకించి బాదం జీర్ణమవడంలో దోహదపడుతుంది. ఎందుకంటే నీళ్లలో నానబెట్టడంతో ఇందులో ఉండే యాసిడ్ గుణాలు పోతాయి ఐరన్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ సులభంగా సంగ్రహణ అవుతాయి. అయితే కొంతమంది తొక్కలు ఒలిచి తింటారు. ముఖ్యంగా గొంతులో గరగర లేదా జీర్ణక్రియ సమస్య ఉండేవాళ్లకు మాత్రం తొక్క ఒలిచి తినడమే మంచిది.


బాదం జీర్ణంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోతే తొక్కతో సహా తినవచ్చు. బాదం తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి అద్భుతంగా దోహదం చేస్తుంది. 


Also read: Weight Loss Remedies: రోజుకు రెండు సార్లు అనాస పూవు టీ తాగితే నెలరోజుల్లో వెయిట్ లాస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.