How To Get Rid Of Belly Fat: ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా అరువు పెరగడం కారణంగా శరీర ఆకృతిని కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు, డైట్ పద్ధతులను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి చాలు:
రోజూ క్యారెట్ తినండి:

ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ లో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 8, విటమిన్ కె సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల వేగంగా మంచి ఫలితాలు పొందుతారు.


క్యారెట్ జ్యూస్ లాభాలు:
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
క్యారెట్ జ్యూస్ లో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయి. దీంతో సులభంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఈరోజు  వ్యాయామం చేసిన తర్వాత క్యారెట్ జ్యూస్ ని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


రోగ నిరోధక శక్తి బూస్ట్ చేస్తుంది:
వర్షాకాలంలో వాతావరణం లోని తేమ పెరిగి చాలామందిలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. మరికొంతమందిలో జలుబుతో పాటు తీవ్ర జ్వరం డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ ని తాగాల్సి ఉంటుంది.


చర్మ సమస్యలకు చెక్:
క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్ ల లక్షణాలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో తీవ్ర చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మొటిమలు మచ్చల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook