Pimples: మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి!
Pimples Home Remedies: నేటి కాలంలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల చర్మం అందవికారంగా మారుతుంది. మొటిమలు ఎందుకు వస్తాయి..? వీటి నుంచి ఎలా బయట పడవచ్చు అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం...
Pimples Home Remedies: మొటిమలు రావడాని ప్రధన కారణం ఆహార అలవాట్లు, జిడ్డు చర్మం, వాతావరణ కాలుష్యం, హార్మోన్లు మార్పులు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందమందిలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అధిక ఖర్చుతో చికిత్స చేసుకుంటారు. అనే ఫలితం ఎక్కువ కాలం ఉండదు. మొటిమలతో బాధపడే వారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
✲ కీరదోస రసం: మొటిమల సమస్యతో బాధపడే వారు కీరదోస రసాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కీరదోస రసాన్ని మొటిమలపై రాసి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
✲ కొబ్బరి నూనె: కొంతమంది చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెను రాసి మర్దనా చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి.
✲ పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దాగి ఉంటాయి. మొటిమల సమస్యను తగ్గించడంలో పసుపు సహాయపడుంది.
Also read: Cholesterol Tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా మజ్జిగ చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ ఇట్టే మాయం
✲ తేనె: మొటిమలను తగ్గించడంలో తేనె సహాయపడుతుంది. తేనెను ముఖం మీద రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
✲ నిమ్మరసం: నిమ్మరసం ఫేస్ ప్యాక్‌లో వేసుకొని 15నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
✲ అలోవెరా జెల్: అలోవెరా జెల్‌ను అరగంట పాటు ముఖం మీద రాసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
Also read: Thati Bellam: ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు ఈ తాటి బెల్లంతో సమస్య నివారణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook