Pistachios For Belly Fat: డ్రైఫ్రూట్స్‌లో శరీరానికి చాలా ప్రయోజనకంగా ఉండేవాటిలో పిస్తా పలుకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్‌ లభిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో వీటిని డైట్‌లో వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్‌ను కూడా ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకులనుకునేవారు తప్పకుండా పిస్తా పలుకులు తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 పిస్తాపప్పులో 5 గ్రాముల ప్రోటీన్స్‌, 163 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కొవ్వు, కేలరీలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే చాలా మందికి పిస్తా  పలుకుల్లో కొవ్వులుంటాయి. ఇవి ఎలా శరీర బరువును తగ్గిస్తుందని సందేశం కలుగొచ్చు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పిస్తాల్లో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు అధికంగా ఉన్న బెల్లీ ఫ్యాట్‌ను ప్రభావవంతంగా నియంత్రిస్తుంది.


పిస్తా బరువు తగ్గించడానికి సహాయపడుతంది:
ఇటీవలే పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. పిస్తాలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా పొట్ట కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. పిస్తా పలుకులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఆహారంలో తప్పకుండా పిస్తా పలుకులను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుసరించే డైట్‌లో కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


పిస్తా తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
>>పిస్తాపప్పులో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలి నియంత్రించి ఆరోగ్యంగా శరీర బరువును నియంత్రిస్తుంది.
>>ఇందులో మంచి బ్యాక్టీరియా కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి పొట్టలో పేగుల సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
>>పిస్తాలో ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది శరీరంలోని రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
>>పిస్తాపప్పులో పొటాషియం, సంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి గుండె పోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ


Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook