How To Lose Weight: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మంది డైట్స్‌ను కూడా అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తప్పకుండా పలు పోషకాలున్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది తీసుకునే ఆహారాలు కూడా మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల బరువు తగ్గమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాల్లో మంచి పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. డైట్ పాటించే క్రమంలో నిద్ర లేచిన 3 గంటల తర్వాతే అల్పాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరిగే అవకాశాలుంటాయి. అంతేకాకుండా చాలా మంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల ఆహారాలను బ్రేక్‌ ఫస్ట్‌లో తింటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తింటే బరువు పెరుగుతారు:


జ్యూస్:
చాలా మంది బరువు తగ్గడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ తాగుతున్నారు. అయితే వీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ జూస్‌ను రోజూ ఉదయం పూట తాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే జ్యూస్‌లకు బదులుగా మంచి పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్, పరాటాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


బిస్కెట్లు:
అల్పాహారంలో ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తింటున్నారు. ఇలా చేయడం వల్ల బరువు సులభంగా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో లభించే డైజెస్టివ్ బిస్కెట్లలో ఆరోగ్యానికి హాని కలిగించే కేలరీలు, చక్కెర పరిమాణాలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.


పరాటా:
చాలా మంది పరాటాలను అల్పాహారంలో తినడానికి ఇష్టపడతారు. అయితే ఇలా క్రమం తప్పకుండా అల్పాహారంలో పరాటాలను తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోవద్దు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..  


Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగంby Taboola



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook