Chia Seeds Benefits: చియా సీడ్స్ ఈ 5 విధాలుగా తీసుకుంటే పూర్తి ఫలితాలు పొందుతారు తెలుసా?
Chia Seeds Benefits: చియా సీడ్స్‌ను నట్ బట్టర్‌తో కలిపి బ్లెండ్ చేయాలి దీన్ని మీరు టోస్టు, క్రాకర్స్ కు డిప్ చేసి తీసుకోవాలి. అంతేకాదు వీటిని పండ్లు, కూరగాయాల్లో కలిపి తీసుకోవాలి. ఈ స్ప్రెడ్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉంటుంది.
Chia Seeds Benefits: చియా సీడ్స్ పోషకాలకు పవర్‌హౌజ్. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్ని చిన్ని సీడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే మీ శరీరానికి కావాల్సిన శకి కూడా అందుతుంది. చియా సీడ్స్ ఎలా తీసుకుంటే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?
చియా పుడ్డింగ్..
చియా పుడ్డింగ్‌ను పాలు లేదా యోగార్ట్‌లో వేసుకుని తీసుకోవచ్చు. ఇందులో స్వీట్ రుచి రావడానికి తేనె, మ్యాపుల్ సిరప్ వేసుకుని తీసుకోవచ్చు. యోగర్ట్‌లో చియా సీడ్స్ వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. అప్పుడు ఇది క్రీమీ రూపంలోకి మారుతుంది. ఇందులో పండ్లు, గింజలు ఇతర మసాలాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
స్మూథీ..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చియా సీడ్స్ స్మూథ లేదా ఫ్రెష్ జ్యూస్ రూపంలో తీసుకోవాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఈ స్మూథీ లేదా జ్యూస్ తీసుకుంటే మంచిది. ఈ జ్యూస్‌లో ఫైబర్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్ చిక్కగా ఉండటమే కాకుండా క్రంచీగా కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!
కుకింగ్..
చియా సీడ్స్ బేక్ చేసిన ఆహారపదార్థాల్లో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా బ్రెడ్, మఫీన్స్, కుకీస్ రూపంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా లభిస్తాయి. సలాడ్ యోగార్ట్, ఓట్మీల్ పై చల్లుకుని కూడా తీసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చియా సీడ్ వాటర్..
దీన్ని మరింత సులభంగా తయారు చేసుకోవచ్చు. నీటిలో చియా సీడ్స్‌ను నానబెట్టాలి. అప్పుడు జెల్ రూపంలోకి మారుతుంది. దీన్ని నీటిలో కలుపుకుని తీసుకోవాలి. లేకపోతే నిమ్మరసం కూడా పిండుకుని తీసుకోవచ్చు. చియా నీటిని ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ అందుతుంది.
ఇదీ చదవండి: ఈ 4 సూపర్ ఫుడ్స్ తో మంచి నిద్ర.. గుండె ఆరోగ్యం.. మీ డైట్లో ఉన్నాయా?
చియా సీడ్ స్ప్రెడ్..
చియా సీడ్స్‌ను నట్ బట్టర్‌తో కలిపి బ్లెండ్ చేయాలి దీన్ని మీరు టోస్టు, క్రాకర్స్ కు డిప్ చేసి తీసుకోవాలి. అంతేకాదు వీటిని పండ్లు, కూరగాయాల్లో కలిపి తీసుకోవాలి. ఈ స్ప్రెడ్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉంటుంది. చియా సీడ్స్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, బివరేజెస్ లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి