Loss Weight with Cucumber Peel: దోసకాయను ఆయుర్వేద శాస్త్రంలో సూపర్‌ ఫుడ్‌గా భావిస్తారు. ఇందులో 95 శాతం వాటర్‌ కంటెంట్‌ లభిస్తుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దోసకాయ శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుందో దాని తొక్క కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే దోసకాయ తొక్క చిప్స్‌లా కూడా తయారు చేసుకుని తినొచ్చు. ఇలా చేసుకుని తినడం వల్ల నోటికి రుచిని కలిగించడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దోసకాయ తొక్క చిప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


దోసకాయ పీల్ చిప్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:
1. దోసకాయ తొక్కలు 1 కప్పు
2. చిటికెడు నల్ల మిరియాలు
3. రుచికి సరిపడ నల్ల ఉప్పు
4. ఎర్ర మిరపకాయల పొడి చిటికెడు
5. వేయించడానికి కావాల్సిన నూనె


Also Read: White Hair Problem: తెల్ల జుట్టు వస్తుందా? ఇలా చేస్తే శాశ్వతంగా 7 రోజుల్లో మాయం!


చిప్స్ తయారి విధానం:
1. దోసకాయ పీల్ చిప్స్ చేయడానికి ముందుగా పై పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
2. ఆ తర్వాత దోసకాయ తొక్కలను తీయాల్సి ఉంది.
3. వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి.
4. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి పీల్స్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది.
5. బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ కాగితాన్ని ఉంచండి.
6. పీల్స్‌పై వెన్న లేదా నెయ్యితో అప్లై చేయాల్సి ఉంటుంది.
7. తొక్కలపై పైన పేర్కొన్న పదార్థాలను చల్లుకోవాలి.
8. మైక్రోవేవ్‌లో ఉంచి రెండు వైపులా సుమారు 10 నిమిషాల పాటు బేక్ చేయాలి.
9. ఇలా తయారు చేసిన చిప్స్‌ను క్రమం తప్పకుండా ప్రతి రోజూ తింటే సులభంగా బరువు తగ్గుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook