ప్రపంచంలోనే అతి చిన్న పేస్మేకర్ తో ఒక వృద్ధుడికి చేసిన గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్లు, ప్రస్తుతం ఆయన ఎంతో ఉల్లాసంగా తిరుగుతున్నాడని కాంటినెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన మాట్లాడుతూ.. "80 సంవత్సరాల వృద్ధుడు తమవద్దకు వచ్చి తానూ పడుతున్న బాధలు చెప్పాడు. రోగనిర్ధారణ కొరకు వివిధ పరీక్షలు చేయగా.. ఆయనకు స్లో హాట్ బీట్ ఉందని గుర్తించాము. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆపరేషన్ చేశాం.  'లీడ్ లెస్ పేస్మేకర్' సహాయంతో ఆయన శస్త్ర చికిత్స విజయవంతం అయ్యింది"అన్నారు.  


ఏడాది క్రితమే అమెరికన్‌ ఎఫ్‌డీఏ ‘లీడ్‌ లెస్‌ పేస్‌మేకర్‌’ ను అనుమతించింది. ఇది సాధారణ పేస్మేకర్ తో పోలిస్తే సైజులో పదవ వంతు మాత్రమే ఉంటుంది. అంతేకాక 50 శాతం వరకు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు తక్కువవుతాయి. ఆపరేషన్ ఖర్చు రూ.10-12 లక్షలు, పేస్మేకర్ జీవితంకాలం 12 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.